Advertisementt

‘2.O’ టీమ్ షాక్స్ మీద షాక్స్ ఇస్తున్నారుగా?

Tue 11th Sep 2018 11:19 PM
2 point o movie,shocking budget,rajinikanth,shankar  ‘2.O’ టీమ్ షాక్స్ మీద షాక్స్ ఇస్తున్నారుగా?
Shocking Budget to 2.0 movie ‘2.O’ టీమ్ షాక్స్ మీద షాక్స్ ఇస్తున్నారుగా?
Advertisement
Ads by CJ

'బాహుబలి' రెండు పార్టులు కలిపితే ఐదున్నర గంటలు లోపే నిడివి ఉంటుంది. ఈ సినిమా రెండు పార్టులు కలిపితే నాలుగు వందల కోట్లు ఖర్చు అయింది. అలాంటిది శంకర్ సృష్టించిన  '2.0' చిత్రానికి 75 మిలియన్‌ డాలర్లు బడ్జెట్ అయిందని నిర్మాతలు చెప్పుకుంటున్నారు. కేవలం గంటన్నర నిడివి ఉన్న ఈ చిత్రంతో 'బాహుబలి' బడ్జెట్ ను దాటేశామని చెబుతున్నారు  '2.0' మేకర్స్.

ఈ మూవీ కోసం ఏకంగా వందల పాతిక కోట్లకి పైగా ఖర్చు అయిందని నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి నిజానికి ఇంత ఖర్చు అయిందో లేదో తెలియదు కానీ ఈ సినిమాను తెరకెక్కించేందుకు భారీగా డబ్బు అయితే వృధా అయిందని అర్ధం అవుతుంది. మొదట ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ ఓ ప్రముఖ కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ వారు ఉన్నట్టుండి దివాలా తీయడంతో ఆ వర్క్ మొత్తం వదిలేసుకుని వేరే కంపెనీలకి కాంట్రాక్ట్‌  ఇచ్చారు.

కేవలం గ్రాఫిక్స్ వర్క్స్ కే చాలా ఖర్చు అయిందని చెబుతున్నారు. దానికి తోడు సినిమా బాగా లేట్ అయింది. దాంతో వడ్డీలు ఎక్కువ అయ్యిపోయాయి. అందుకే ఈ సినిమాకి తెలియని ఖర్చు అయిందని తెలుస్తుంది. ఏదేమైనా ఇది భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలుస్తోంది. బడ్జెట్ అయితే ఇంత అయింది మరి కలెక్షన్స్ ఆ విధంగానే వస్తాయా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఇక ఈ చిత్రం టీజర్ ఈనెల 13న రిలీజ్ అవ్వబోతోంది. అలానే సినిమా నవంబర్ 29న విడుదల అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Shocking Budget to 2.0 movie:

2.0 Team Shocks Everyone 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ