కొందరు ధనవంతులకు సామాన్యుల తరహాలో రోడ్డు మీద బండిలో మిరపకాయ బజ్జీలు తినాలని, ఇతరత్రా ఎన్నో సాధారణమైన కోర్కెలు ఉంటాయి. అలాంటి ఓ కోరిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మకి నెరవేరింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'సుయ్‌దాగా' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె ఓ కుగ్రామానికి చెందిన యువతిగా డీగ్లామర్ రోల్‌ని పోషిస్తుండగా, షాహిద్‌కపూర్ హీరోగా నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత అయిన శరత్ కటారియా దర్శకత్వంలో మనీష్‌శర్మ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇది ఓ కుగ్రామంలో జరిగే కథాంశం. ఇందులో వరుణ్‌థావన్ మౌజీ అనే పాత్రను పోషించాడు. చిన్నచిన్న గ్రామాలలో ఇప్పటికీ అందరు వాడే వాహనం సైకిల్. ఈ చిత్రంలో వరుణ్‌ధావన్‌కి సైకిల్ అంటే ఎంతో ఇష్టం. తన కష్ట సుఖాలను దానితోనే పంచుకుంటూ ఉంటాడు.
ఇది ప్రేమ, ఆత్మవిశ్వాసం నేపద్యంగా సాగే మంచి ఫీల్‌గుడ్ మూవీ. 'ధమ్ లగా కే హైసా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ దర్శక నిర్మాతలు కలిసి తీసిన మరో చిత్రం ఈ 'సుయ్‌దాగా'. ఈ చిత్రం గురించి వరుణ్‌ధావన్ మాట్లాడుతూ, ఇందులో నేను అనుష్కశర్మ కలిసి సైకిల్‌పై తిరిగే సన్నివేశాలు ఎంతో బాగా వచ్చాయి. ఈ చిత్రం కోసం 15రోజుల పాటు రోజుకి 10గంటలు సైకిల్ తొక్కాను.. అని చెప్పుకొచ్చాడు. అనుష్కశర్మ మాట్లాడుతూ, వరుణ్‌ధావన్ సైకిల్ తొక్కుతుంటే నేను సైకిల్ ముందు కూర్చున్న సీన్స్ భలే ఉన్నాయి. వేసవి కాలంలో విపరీతమైన ఎండల్లో ఉత్తర భారతదేశంలో ఈ సీన్స్‌ని చిత్రీకరించారు.
నాకు సైకిల్‌పై కూర్చునే అలవాటు లేదు. నేనెప్పుడు సైకిల్ వాడలేదు. ఆ సన్నివేశాల కోసం ఎక్కువ సేపు సైకిల్‌పై కూర్చోవడం ఇబ్బందిగా అనిపించినా ఆ అనుభవం చాలా బాగుంది అని చెప్పుకొచ్చింది. ఇందులో అనుష్కశర్మ వేషధారణ, అభినయం గత చిత్రాల కంటే ఎంతో భిన్నంగా ఉంటాయట. ఇందులో అచ్చు గ్రామీణ యువతిగా అనుష్కశర్మ మారిపోయింది. యష్‌రాజ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై బారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.