ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూజాహెగ్డే హీరోయిన్‌గా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం రూపొందుతోంది. జగపతిబాబు, సునీల్, నాగబాబు తదితరులు కీలకపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన టీజర్ విపరీతమైన స్పందనను రాబట్టుకుంది. విజయదశమి కానుకగా వచ్చే నెల అంటే అక్టోబర్ 11న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో ఈనెల 20వ తేదీన విడుదల కానుంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించి తాజాగా లిరికల్ వీడియోను విడుదల చేశారు. 'అనగనగా' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌కి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, త్రివిక్రమ్‌తో తొలిసారి జోడీ కడుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. 'చీకటిలాంటి పగటిపూట.. కత్తులాంటి పూదోట.. జరిగిందొక వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటారా? అంటూ సాగిన గీతాన్ని అమన్ మాలిక్ ఆలపించారు.
ఇందులో ఎన్టీఆర్ వీరరాఘవ అనే చిత్తూరు యువకునిగా, రాయలసీమకి చెందిన యాసతో మాట్లాడుతూ, రఫ్ లుక్‌తో పాటు సాఫ్ట్ లుక్‌లో కూడా కనిపించనున్నాడు. ఇక పూజాహెగ్డే ఇందులో ఎన్టీఆర్‌ని ఉద్దేశించి 'టఫ్‌గా కనిపిస్తారు. కానీ మాట వింటారు. ఫర్వాలేదు' అని కితాబునిస్తుండటం విశేషం. ఎస్.రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు హారిక అండ్ హాసిని బేనర్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రంపై త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లే కాదు.. వారి అభిమానులు కూడా భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నారు.