హీరోయిన్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన సమంత ఇప్పుడు తను ప్రొడ్యూసర్ గా మారబోతున్నట్టు తన మనసులో మాట బయట పెట్టింది. అయితే ఆమె అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మించబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది సామ్. లేటెస్ట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఈసారి మరింత స్పష్టంగా తన మనసులో మాట బయటపెట్టింది.
నాకు సినిమాలు నిర్మించాలనే కోరిక ఉంది. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ లో కాదు...మనం ఎంటర్ టైన్ మెంట్స్ లో కూడా కాదు. నా సొంతంగా అంటే నా సొంత డబ్బులతో సినిమాలు నిర్మించాలని ఉంది. నేను నిర్మించిన సినిమాలు సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూసుకోవాలనివుందని అంటున్నది సామ్. కొత్తవాళ్లతో, కొత్త టాలెంట్ తో సినిమాలు చేస్తాను.
ఇప్పటికే నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ నేను ఇప్పుడు ఆ సినిమాలు స్టార్ట్ చేయను ఇంకా చాలా టైం ఉంది. నాలో నటి ఇంకా అలానే ఉంది. నేను ఇంకా చాలా పాత్రలు చేయాలి. ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా 'యూటర్న్', 'రాజుగారి గది-2' లాంటి సినిమాలతో ఓ కొత్త రకమైన జర్నీ ప్రారంభించాను. సో నేను ఎప్పుడు నిర్మాతగా మారతానో నాకే తెలీదు. దానికింకా చాలా టైం ఉందని అంటుంది సామ్. నాగార్జున, నాగచైతన్య సహకారం లేకుండానే తన సొంత డబ్బులతో సినిమాలు తీస్తాను అని అంటుంది సామ్.