Advertisementt

టాప్ 3 లో ఆ ముగ్గురుంటే.. కౌశల్ సంగతేంటి?

Tue 18th Sep 2018 01:41 PM
amit,eliminate,bigg boss 2,bigg boss 2 winners  టాప్ 3 లో ఆ ముగ్గురుంటే.. కౌశల్ సంగతేంటి?
Amith Announces Winner Of Bigg Boss 2 టాప్ 3 లో ఆ ముగ్గురుంటే.. కౌశల్ సంగతేంటి?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ముగింపు ద‌గ్గ‌ర‌కు వచ్చిందో తెలియకుండా చాలా త్వరగా ముగింపు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. మరో రెండు వారాల్లో ముగియనున్న సీజన్ 2  టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో అని ఇప్పటి నుండే చాలా హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. చివరికి వచ్చేసరికి ఎవరికి వారే గ‌ట్టి పోటీని ఇస్తుండ‌టంతో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో అని ఒక నిర్ణ‌యానికి రాలేకపోతున్నారు.

ఇక నిన్న (ఆదివారం) అమిత్ ఎలిమినేట్ అవ్వడంతో పోటీ మరింత రసపట్టుగా సాగనుంది. అమిత్ ఎలిమినేట్ అవ్వడంతో ఇంకా హౌస్ లో ఆరుగురు ఉంటారు. ఆరుగురిలో నెక్స్ట్ వీక్ ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. నెక్స్ట్ వీక్ మిగిలే ఆ ఐదుగురు ఫైన‌ల్ కు చేరుకుంటారు. వీరిలో ఒక్కరు విజేత‌గా నిలవనున్నారు. ఈనేపధ్యంలో అమిత్ వెళ్తూ వెళ్తూ టాప్ 3 లో నిలిచే కంటెస్టెంట్లు ఎవ‌రు? అని నాని అడిగిన ప్రశ్నకు ఆస‌క్తిక‌ర స‌మాధానాన్ని ఇచ్చాడు. 

ఇందులో నాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చెబుతున్నా అని రోల్ రైడా.. సామ్రాట్‌.. గీతామాధురి పేరులు చెప్పాడు. ప్రస్తుతం అమిత్ ఇలా చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. మొదటి నుండి విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉన్న కౌశ‌ల్ పేరును అమిత్ చెప్ప‌క‌పోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మరి అమిత్ అంచనా ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే. మరోపక్క కౌశల్ కి బయట ఎక్కువ నెగిటివిటీ వస్తున్న.. నేపథ్యంలో విన్నర్ ఎవరు అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది.

Amith Announces Winner Of Bigg Boss 2:

Amit eliminated from bigg boss 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ