Advertisementt

తమన్నా గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే..!

Tue 18th Sep 2018 02:18 PM
tamanna bhatia,diamond business,own name,heroine,record  తమన్నా గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే..!
Tamannaah Launches Own Jewellery Store తమన్నా గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే..!
Advertisement
Ads by CJ

నేటితరం హీరోయిన్లు ఒకప్పటి వారిలా అమాయకంగా ఉండటం లేదు. సంపాదించిన మొత్తాన్ని తమకు ఫేమ్‌ ఉండగానే పలు వ్యాపారాలలో పెట్టుబడి పెడుతున్నారు. తమకు ఎలాగూ క్రేజ్‌ ఉంది... పలు సెలబ్రిటీలతో మంచి పరిచయాలు ఉంటాయి కాబట్టి రిటైర్‌ అయిన తర్వాత కంటే ఫామ్‌లో ఉన్నప్పుడే వ్యాపారం ప్రారంభిస్తే పైసా ఖర్చులేకుండా తమ బిజినెస్‌ని బాగా డెవలప్‌ చేసుకోవచ్చనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే రకుల్‌ప్రీత్‌సింగ్‌తో సహా పలువురు జిమ్‌లు, రెస్టారెంట్లు స్థాపించి ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో కాస్త లేటుగా అయినా సరే తమన్నా మంచి నిర్ణయం తీసుకుంది. ఈమెకి ‘బాహుబలి’తో మంచి గుర్తింపువచ్చింది. పలు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘బాహుబలి’కి ధీటుగా రూపొందుతున్న ‘సై...రా..నరసింహారెడ్డి’తో పాటు కొన్ని చిత్రాలలో నటిస్తోంది. ఒకప్పటి ఊపు లేకపోయినా కూడా తన కెరీర్‌ను ఎలాగోలా ముందుకు సాగిస్తోంది. ఇంకా ఫేడవుట్‌ కాకముందే తనకి తెలిసిన వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 

తాను సంపాదించిన మొత్తానికి వజ్రాల వ్యాపారంలో పెట్టుబడి పెడుతోంది. తనపేరుతోనే వజ్రాల వ్యాపారం ప్రారంభిస్తోంది. ‘తమన్నా డైమండ్‌ జ్యూయెలరీ’ పేరుతో పలు బ్రాంచ్‌లతో వ్యాపారం చేయడానికి రెడీ అయింది. ఈ క్రమంలో డైమండ్‌బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న తొలి దక్షిణాది హీరోయిన్‌గా రికార్డు పుటలకి ఎక్కుతోంది. గతంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు అయిన కరీనా కపూర్‌, కత్రినాకైఫ్‌ వంటి వారు డైమండ్‌ జ్యూయలరీలోకి అడుగుపెట్టి ఉన్నారు. అయితే వారు చేయని సాహసాన్ని తమన్నా చేస్తోంది. అదేమిటంటే.. కరీనా, కత్రినాలు డైమండ్‌, జ్యూయెలరీ వ్యాపారంలోకి అడుగుపెట్టినా కూడా సొంత బ్రాండ్‌పై వారు వ్యాపారాలు చేయలేదు. ఈ విషయంలో తమన్నా గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులతో ఈ అమ్మడు బాగా బిజీగా ఉంది. సినిమాలు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఈమె పూర్తిగా తన వ్యాపారంపై దృష్టి పెట్టనుంది. 

Tamannaah Launches Own Jewellery Store:

Actress Tamanna Bhatia Stepping into Diamond Business

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ