Advertisementt

ప్రేమకి తాజ్.. స్వర్ణదేవాలయం దేనికి నయన్?

Tue 18th Sep 2018 07:08 PM
nayanthara,vignesh shivan,golden temple,love birds,tajmahal  ప్రేమకి తాజ్.. స్వర్ణదేవాలయం దేనికి నయన్?
Nayanthara and Vignesh Shivan on a trip to Golden Temple ప్రేమకి తాజ్.. స్వర్ణదేవాలయం దేనికి నయన్?
Advertisement
Ads by CJ

ప్రభుదేవా, శింబు వంటి వారితో మోసపోయిన కూడా దాని ప్రభావం తన కెరీర్‌పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ లేడీ సూపర్‌స్టార్‌గా దక్షిణాదిలోనే పేరు తెచ్చుకుంటూ ఇంకా ఇంకా పైకి దూసుకెళ్తున్న మలయాళ కుట్టి నయనతార. ప్రేమ పెటాకులైన తర్వాత ఈమె కెరీర్‌ అద్భుతమైన మలుపు తిరిగింది. ప్రస్తుతం దక్షిణాదిలోని స్టార్‌ హీరోలతో సరిసమానమైన ఇమేజ్‌ని, క్రేజ్‌ని, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగే సమ్మోహన శక్తిని, స్టార్‌ హీరోలతో సరిసమానమైన పారితోషికాన్ని ఆమె అందుకుంటోంది. ఇక ఈమెకి ‘నానుమ్ రౌడీ ధాన్‌’ చిత్రం సమయంలో దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో పరిచయమం మొదలై ప్రేమగా మారిందని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. 

వీరిద్దరు వివాహం కూడా చేసుకున్నారని, కేవలం నయన కెరీర్‌ని దృష్టిలో పెట్టుకునే వీరు ఈ విషయాన్ని దాస్తున్నారని అంటున్నారు. అంతే కాదు.. నయనతార, విఘ్నేశ్‌శివన్‌లు ఒకే అపార్ట్‌మెంట్‌లో కలిసే ఉంటున్నారని కూడా కోలీవుడ్‌ మీడియా రుజువులు చూపిస్తోంది. అయితే వీరిద్దరు తమ మద్య ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఎప్పుడు వెనుకాడలేదు. విఘ్నేశ్‌ శివన్‌ బర్త్‌డే సందర్భంగా విదేశాలలో తన స్నేహితులతో కలిసి నయననే గ్రాండ్‌ పార్టీ ఇచ్చింది. విఘ్నేశ్‌కి తాజ్‌మహల్‌ ప్రతిమను బహుమానంగా ఇచ్చింది. తాజ్‌మహల్‌ అంటే ప్రేమకు చిహ్నం కావడంతో ఈ విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. 

తాజాగా వీరిద్దరు తీసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరు పంజాబ్‌లోని అమృతసర్‌లో ఉన్న స్వర్ణదేవాలయంలో ఫొటోలు తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇటీవల వినాయకచవితి పూజల ఫొటోలను కూడా పోస్ట్‌ చేశారు. మరి తాజ్‌మహల్‌ అయితే ప్రేమకి గుర్తు.. మరి స్వర్ణదేవాలయం దేనికి గుర్తు అనే విషయంలో నెటిజన్లు బిజీ అయ్యారు. ఇక ప్రస్తుతం ఈమె అజిత్‌ సరసన ‘విశ్వాసం’, మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా..’, ‘కొలైయుదుర్‌కాలం’తో పాటు పలు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలలో నటిస్తోంది.

Nayanthara and Vignesh Shivan on a trip to Golden Temple:

Nayanthara And Vignesh Shivan Visits Golden Temple

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ