Advertisementt

మూడు స్టేట్స్‌లో సక్సెస్ కొట్టాడు: సమంత

Wed 19th Sep 2018 04:26 PM
samantha,u turn,success meet,updates  మూడు స్టేట్స్‌లో సక్సెస్ కొట్టాడు: సమంత
U Turn Success Meet Highlights మూడు స్టేట్స్‌లో సక్సెస్ కొట్టాడు: సమంత
Advertisement
Ads by CJ

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'యూ టర్న్'..  మిస్టరీ థ్రిల్లర్ జోన్ గా వస్తున్న ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ కాగా సినిమా మంచి సక్సెస్ అయ్యింది.. పవన్ కుమార్  దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, భూమిక చావ్లా, హీరో రాహుల్ రవీంద్రన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వి. వై. కంబైన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి , రాంబాబు బండారులు ఈ సినిమాను నిర్మించారు. కాగా నిన్న హైదరాబాద్ లో సినిమా విజయోత్సవ వేడుక జరిగింది.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవిత, డైరెక్టర్ నందినిలు ముఖ్య అతిధులుగా వచ్చారు.

నటుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు అన్న అపోహ ఇప్పుడు లేదు.. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమా, పెద్ద సినిమా ఏదైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ గారికి మంచి టేస్ట్ ఉంది.. ఇంత మంచి సినిమా మొదటి సినిమాగా తీయడం వారికే చెల్లింది.. సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు చాలా థాంక్స్ అన్నారు..

డైరెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. సినిమా విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది.. తెలుగు, తమిళ్లో వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లో మంచి హిట్ అయ్యింది.. ప్రేక్షకులకు ధన్యవాదాలు.. సమంత సినిమాలో చాలా బాగా చేసింది.. మ్యూజిక్ కి మంచి మార్కులుపడ్డాయి.. అన్నారు. 

కవిత గారు మాట్లాడుతూ.. ఈ సినిమాకి పనిచేసిన అందరికి మంచి విజయం దక్కింది..  వండర్ ఫుల్ సినిమా ఇది.. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగా ఉంది అంటున్నారు.. సమంత ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించింది.. రంగస్థలంలో, యూటర్న్ లో చాలా వేరియేషన్స్ చూపించింది.. సమంత సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.. డిఫరెంట్ స్టోరీస్ ఉన్న సినిమాలను ప్రతి ఒక్కరు ఆదరిస్తారు అనడానికి ఈ సినిమానే ఉదాహరణ.. చాలా మంచి సినిమా ఇలాంటి సినిమాని అందరు ఆదరించాలి.. అన్నారు..

డైరెక్టర్ నందిని మాట్లాడుతూ.. కొంతమంది డైరెక్టర్ ల సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాను అలాంటి డైరెక్టర్ లలో పవన్ కుమార్ గారు ఒకరు.. అయన మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. అయన లూసియా సినిమా చూశాను .. చాలా బాగుంది.. అప్పటినుంచి అయన సినిమాలు చూడడం మొదలుపెట్టాను.. అయన తెలుగులోకి కూడా రావడం చాలా ఆనందంగా ఉంది.. ఈ సినిమాలో పనిచేసిన అందరికి కంగ్రాట్స్. సమంత చాలా కష్టపడే వ్యక్తి.. ఆమెకు ఈ విజయం దక్కాలి.. మంచి సినిమా వస్తే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు.. అన్నారు.. 

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. సినిమాని ఇంత హిట్ చేసినందుకు అందరికి థాంక్స్.. మా సినిమాని సపోర్ట్ చేసినందుకు మీడియాకి, రివ్యూయర్స్ కి చాలా చాలా కృతజ్ఞతలు.. నేను చేసిన సినిమాల్లో ఇంత పాజిటివ్ రివ్యూస్ రావడం, నా యాక్టింగ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇక్కడికి వచ్చిన కవిత గారికి, డైరెక్టర్ నందిని గారికి చాలా థాంక్స్.. ఇంత మంచి సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు.. వాళ్ళ ఫస్ట్ సినిమాగా ఇది చేసినందుకు గర్వంగా ఉంది.. నా కెరీర్ లో మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ పవన్ కి చాలా థాంక్స్.. ఈ సినిమాతో మూడు స్టేట్స్ లో సక్సెస్ కొట్టాడు.. ఇది మొదలు మాత్రమే.. ఆయనలో ఇంకా చాలా టాలెంట్ ఉంది.. ఈ చిత్రంలో నటించిన అందరికి శుభాకాంక్షలు.. సినిమా చూసిన ప్రేక్షకులు తప్పకుండ థ్రిల్ కి గురవుతున్నారు.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు.. అన్నారు..

U Turn Success Meet Highlights:

Samantha U Turn Success Meet Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ