Advertisementt

నిర్మాతలను అంతమాట అన్నాడేంటి?

Sat 22nd Sep 2018 12:12 PM
cinematographer,santhosh sivan,tweet,producer  నిర్మాతలను అంతమాట అన్నాడేంటి?
Cinematographer Controversial Comments on Producers నిర్మాతలను అంతమాట అన్నాడేంటి?
Advertisement
Ads by CJ

ప్రతి నాణేనికి బొమ్మబొరుసు ఉన్నట్లుగా, ప్రతి విషయానికి, వాదనకు కూడా రెండు కోణాలుంటాయి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వారు తమపై నిర్మాతలు కాస్లింగ్‌కౌచ్‌కి పాల్పడుతుంటారని, చాన్స్‌లు, రెమ్యూనరేషన్‌ పేరుతో తమను లొంగదీసుకోవాలని భావిస్తూ ఉంటారనే వాదన ఎప్పటి నుంచో ఉంది. మరికొందరి వాదన ఎలా ఉంటుందంటే మగాళ్లకు కూడా కాస్టింగ్‌కౌచ్‌ ఉంటుందని, అలాగే మగవారికి చాన్స్‌ ఇచ్చి తోటి నటీమణులను ఆకట్టుకోవడానికి మగవారిని బాగా హింసిస్తారని అంటారు. ఇప్పుడు ఇలాంటి వివాదంలోనే ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌శివన్‌ కూడా ఇరుకున్నాడు. 

కానీ ఆయన చేసిన వాదనలో కూడా నిజం ఉందనేది వాస్తవం. దేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్‌, నిర్మాత, దర్శకుడు కూడా అయిన సంతోష్‌శివన్‌ దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని సైతం 2014లో పొందాడు. ఇప్పటివరకు 45 చిత్రాలకు, 41 డాక్యుమెంటరీలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ సినిమాటోగ్రాఫర్స్‌గా ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. మలయాళంలో 'పెరుంతచ్చన్‌, మోహినియాట్టం', బహుభాషా చిత్రం 'కాలాపానీ', తమిళ చిత్రం 'ఇరువర్‌' (తెలుగులో 'ఇద్దరు'), మణిరత్నం దిల్‌సే చిత్రాలకు ఆయన జాతీయ అవార్డులను పొందారు. 1988లో దర్శకునిగా 'స్టోరీ ఆఫ్‌ టిబ్లు', ది టెర్రరిస్ట్‌, హలో, మల్లి వంటి చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధించాయి. 

తాజాగా ఆయన ఓ మెమెను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇందులో టెక్నీషియన్స్‌కి పారితోషికం ఇచ్చే నిర్మాత అంటూ కోపంతో అరుస్తున్న ఫొటోని, హీరోయిన్లకు పారితోషికం ఇచ్చేటప్పుడు నిర్మాత అంటూ ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నటువంటి కుక్క ఫొటోను పెట్టాడు. దాంతో వెంటనే నిర్మాతలు ఆయనపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. తర్వాత తప్పు అనుకున్నాడో మరోమో గానీ సంతోష్‌శివన్‌ దానిని డిలీట్ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఈయనపై నిర్మాతల సంఘం చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతోంది. 

Cinematographer Controversial Comments on Producers:

Cinematographer Santhosh Sivan Controversy Tweet About Producer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ