ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు.. ఒక కుమారుడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత ప్రేమ వివాహం చేసుబోతుందనే వార్తలు వస్తున్నాయి. అబ్బాయి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామి రెడ్డి కుమారుడు, సురేందర్ రెడ్డి మనవడు అని సమాచారం.
అయితే ఈ ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్టు తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి ఉండబోతున్నట్టు సమాచారం. వీరిద్దరూ చాలాకాలం నుండి ప్రేమించుకుంటున్నారు. రీసెంట్ గానే తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పారట. దాంతో అశ్రిత పెదనాన్న నిర్మాత డి.సురేష్‌బాబు అబ్బాయి ఇంటికి వెళ్లి పెద్దలతో మాట్లాడటం జరిగిందట. వెంకీ ప్రస్తుతం 'ఎఫ్ 2' షూటింగులో ఉన్నారు. ఆయన హైదరాబాద్ కి తిరిగి రాగానే ఓ మంచి రోజు చూసుకుని అశ్రిత నిశ్చితార్థం జరుగుతుందని తెలుస్తోంది.
ఇంకా అబ్బాయి తాతగారు ఆర్.సురేందర్ రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్‌గా సుప్రసిద్ధులు. ఈ పెళ్లికి రాజకీయ నేతలతో పాటు ఇండస్ట్రీ నుండి చాలామంది సెలెబ్రెటీస్ ను పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే నిశ్చితార్థం డేట్ మరియు పెళ్లి డేట్ చెప్పనున్నారు దగ్గుబాటి ఫ్యామిలీ.