Advertisementt

అమ్మా కీర్తి.. కాస్త ఆలోచించమ్మా..!!

Sun 23rd Sep 2018 06:35 PM
saamy,keerthi suresh,new movie,weight,keerthi suresh actress,mahanati  అమ్మా కీర్తి.. కాస్త ఆలోచించమ్మా..!!
Negative Comments on Keerthi Suresh in Saamy అమ్మా కీర్తి.. కాస్త ఆలోచించమ్మా..!!
Advertisement
Ads by CJ

నిన్నగాక మొన్న నటి కీర్తి సురేష్ కి అవకాశాలు తగ్గిపోయి డిప్రెషన్ లో ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. మహానటితో మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్ తన బరువు కారణంగా అవకాశాలు కోల్పోతుందని టాక్ మొదలైంది. టాలీవుడ్‌లో అజ్ఞాతవాసి సినిమా టైం కే కీర్తి సురేష్ బాగా బరువు పెరగడం.. మహానటి లో కొంత సమయం సన్నగా అందంగా కనిపించినప్పటికీ.. కొన్ని సీన్స్ లో బాగా లావుగా కనబడింది. అయితే సావిత్రి  పాత్రలో కీర్తి సురేష్ సరిగ్గా అతికినట్టుగా యుక్తవయసు నుండి.. అవసాన దశ వరకు సరిపోయింది. కానీ మహానటి తరవాత తెలుగులో అవకాశాలు లేకే అమ్మడు కోలీవుడ్ కి వెళ్లిందనేది లేటెస్ట్ న్యూస్. కోలీవుడ్ లో మహానటి కి ముందే రెండు మూడు సినిమాలకు సైన్ చేసిన కీర్తి సురేష్ కి అప్పుడే ఆ సినిమా ల షూటింగ్స్ దగ్గర పడ్డాయి. ఇప్పటికే విక్రమ్ సరసన హరి డైరెక్షన్ లో సామి 2 సినిమాలో కీర్తి సురేష్ నటించింది. ఆ సినిమాలో కీర్తిసురేష్ నటించడం వలనే తెలుగులో భారీ క్రేజ్ ఏర్పడి తెలుగు డబ్బింగ్ హక్కులు భారీ రేటు పలికినట్టుగా ప్రచారం జరిగింది.

మరి శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామి సినిమాకి కనీసం తెలుగులో యావరేజ్ టాక్ కూడా రాలేదు. సామి సినిమాకి సీక్వెల్ గా చేసిన ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం లేదంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇక హీరో విక్రమ్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు కానీ.. ఆ పాత్ర సినిమాలో తేలిపోయిందంటున్నారు. కథలో బలం లేకపోవడం, హరి డైరెక్షన్ మైనస్ ఇలా అన్నిటి వలన సినిమాకి యావరేజ్ టాక్ పడడం.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ వలన కూడా సినిమాకి మైనస్ అనే టాక్ వినబడుతుంది. విక్రమ్ తో లవ్ ట్రాక్ మరియు విలన్ హీరోని బెదిరించడం కోసం తప్ప ఇంకెందుకు పనికిరాలేదని అంటున్నారు. మహానటి చూసిన కళ్ళతో ఇందులో దియా పాత్రలో కీర్తి సురేష్ ని ఒప్పుకోవడం కష్టం. పైగా బొద్దుగా మారి ఇబ్బందిగా కదలడం ప్రేక్షకుడి చిరాకు పుట్టించింది.

చక్కనమ్మ బొద్దుగా మారితే కష్టమే. హీరోయిన్స్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ సన్నగా నాజూగ్గా ఉండడమే. కానీ కీర్తి సురేష్ నటనతో నెట్టుకొస్తూ.. బరువుని గాలికొదిలెయ్యడం ఆమె కెరీర్ కే ప్రమాదం. సామి సినిమాలో పాటల్లో అయితే కీర్తి సురేష్ విక్రమ్ కన్నా లావుగా కనబడుతూ ఎబ్బెట్టుగా ఉండడం... ఆమె పర్సనాలిటీ మీద బోలెడన్ని కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే అవకాశాలు తగ్గిపోతుంటే.. ఇప్పుడు ఈ బరువు వలన వచ్చే అవకాశాలు కూడా రావడం కష్టమనే వాదన రైజ్ అవుతుంది. కీర్తి కాస్త ఆలోచించమ్మా.

Negative Comments on Keerthi Suresh in Saamy:

Keerthi Drawback to Saamy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ