పెళ్లి చూపులు సినిమాతో యావరేజ్ హీరోగా కనిపించిన విజయ్ కి మధ్యలో ఒక సినిమా ప్లాప్ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ స్టార్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా యూత్ ఐకాన్ అయ్యాడు. ఇలా అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పిన తక్కువే. స్టూడెంట్ గా రఫ్ లుక్ లో క్లిన్ షేవ్ తో ఉన్న విజయ్ దేవరకొండ స్టూడెంట్ గా.. ప్రేమికుడిగా అదరగొట్టేసాడు. ఇక ప్రియురాలిని కోల్పోయిన డాక్టర్ గా.. గెడ్డం పెంచి రఫ్ లుక్ లో ఇరగదీసాడు. చివరికి తన నానమ్మ మరణంతో లైఫ్ గురించిన క్లారిటీ తో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ బుద్ధిమంతుడిగా మారి.. చివరికి ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతాడు. మరి ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలో విజయ్ అదరగొట్టేశాడు.
అలాంటి అర్జున్ రెడ్డి సినిమాని కోలీవుడ్ లో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా బాల దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ కి ‘వర్మ’ అనే రఫ్ టైటిల్ కూడా పెట్టారు. ఇక తాజాగా కోలీవుడ్ అర్జున్ రెడ్డి అదేనండి ధృవ్ వర్మ టీజర్ ని కూడా వదిలారు. మారా టీజర్ లో తెలుగు అర్జున్ రెడ్డిని యాజిటీజ్ గా అయితే దింపేశారు. కాకపోతే తెలుగు అర్జున్ రెడ్డి లో ఫుడ్ బాల్ గేమ్ అయితే.. తమిళ అర్జున్ రెడ్డిల లో హాకీ ని ప్రధాన ఆటగా చూపెట్టారు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నమాట. అయితే అంతా ఓకే గాని వర్మ లుక్ లో ధృవ్ మాత్రం అస్సలు నప్పలేదు. అర్జున్ రెడ్డిగా విజయ్ ఎంత బావున్నాడో.. వర్మగా ధృవ్ మాత్రం అస్సలు కుదరలేదు. టీజర్ లో చూస్తుంటే ధృవ్ కాస్త వళ్ళుతో.. రఫ్ లుక్ లోను తేలిపోయాడనే టాక్ కాదు మనం కూడా చెబుతాం.
అర్జున్ రెడ్డి లుక్ లో విజయ్ దేవరకొండ కి ఎంత క్రేజొచ్చిందో.. వర్మ లుక్ లో ధృవ్ కి అంత బ్యాడ్ నేమ్ రావడం ఖాయమంటున్నారు. మొదటి సినిమాకే ధృవ్ ఇలా కనిపించడం కోలీవుడ్ జనాలకు ఓకేనేమో కానీ.. తెలుగు ప్రేక్షకులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మన అర్జున్ రెడ్డి ఎంత రఫ్ గా ఉన్నా ముద్దొచ్చాడు. కానీ తమిళ అర్జున్ రెడ్డి ని అసలు చూడాలనిపించడం లేదంటున్నారు. ధృవ్ ఎక్సప్రెషన్స్ కానీ, అర్జున్ రెడ్డి స్టయిల్ కానీ... లుక్స్ కానీ ఎందులోనూ విజయ్ తో పోల్చలేక ధృవ్ ని ఆడేసుకుంటున్నారు. మరి తెలుగు అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయితే.. తమిళ వర్మతో ధృవ్ ఏమైపోతాడో అంటున్నారు.