ఆమె అసలు పేరు కియారా అలియా అద్వానీ. ఈమె తండ్రి జగదీష్ అద్వానా ప్రముఖ వ్యాపారవేత్త. తల్లి పేరు జెనీవీ జాఫ్రే. తండ్రి సింధు అయితే తల్లి ఒక క్యాధలిక్కు. స్కాటిష్, ఐరిష్, పోర్చుగీస్, స్పానిష్ సంతతికి చెందిన మహిళ. ఈమె మొదట బాలీవుడ్‌లో ‘ఫగ్లీ, ఎం.ఎస్.ధోని, మెషీన్’ చిత్రాలు చేసింది. ఈమె తెలుగులో మొదటి చిత్రమే ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్ ‘భరత్ అనే నేను’ ద్వారా పరిచయం అయింది. ప్రస్తుతం ఎంతో భారీగా రూపొందుతున్న రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రంలో నటిస్తోంది. ఇక ‘లవ్‌స్టోరీస్, కళంక్’ వంటి బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. తెలుగు హీరోయిన్ అంటే ఎంత గ్లామర్ ఒలికించినా కూడా మరీ బోల్డ్ సీన్స్‌లో నటిస్తే తర్వాత స్టార్స్ చిత్రాలలో ఆమెకి ఐటం గర్ల్‌గా పాత్రలు రావచ్చేమో గానీ హీరోయిన్ పాత్రలు మాత్రం పెద్దగా రావు. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైంది. తెలుగు హీరోయిన్ అంటే గ్లామర్ ఒలికిస్తూనే తెలుగుదనం కాస్తైనా కనిపించేలా ఉండాలి.
ఇక విషయానికి వస్తే తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఇందులో విజయ్‌దేవరకొండతో పోటీగా షాలినీ పాండే నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. తమిళంలో ఈ చిత్రం ద్వారానే చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతుండగా బోల్డ్, రా చిత్రాలు బాగా తీసే దర్శకునిగా దేశంలోనే నెంబర్ వన్ అయిన బాలా దర్శకత్వం వహిస్తున్నాడు. ‘వర్మ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మేఘా చౌదరి హీరోయన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్స్ తాజాగా విడుదలై అద్భుతమైన స్పందన రాబడుతున్నాయి.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే తెలుగులో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే హిందీలో కూడా తీస్తున్నాడు. కానీ ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటించడానికి ఒప్పుకున్నా కూడా బోల్డ్ సీన్స్‌ని ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని బాలీవుడ్ అమ్మాయిలే నో చెబుతున్నారు. సంతారియాతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఒప్పుకుని మరీ తప్పుకున్నారు. చివరగా ఇందులో హీరోయిన్ పాత్రలకి కియారా అద్వానీ ఒప్పుకుందనే సంచలన వార్తలు వస్తున్నాయి తెలుగులో బంగారం వంటి భవిష్యత్తు ఉన్న కియారా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం అది సంచలనమే అవుతుంది. బాలీవుడ్‌లో ఈ చిత్రం చేస్తే మాత్రం తెలుగులో అవకాశాలపై ఆమె నీళ్లు వదులుకోకతప్పదంటూ అప్పుడే కొందరు ఆమె నిర్ణయంపై కామెంట్స్ చేస్తుండటం విశేషం.