Advertisementt

ఈ ట్రెండ్‌కి మెగా ఫ్యామిలీనే కారణం!

Wed 26th Sep 2018 06:13 PM
chiranjeevi,ram charan,sushmita,rc12 sets,azerbaijan  ఈ ట్రెండ్‌కి మెగా ఫ్యామిలీనే కారణం!
Chiranjeevi, Ram Charan And Sushmita From RC12 Sets at Azerbaijan ఈ ట్రెండ్‌కి మెగా ఫ్యామిలీనే కారణం!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో సినీ ప్రముఖుల కూతుర్లు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ ఇది టాలీవుడ్‌లో తక్కువే. ఇక నేడు స్టార్స్‌ వారసురాళ్లు వెంటనే ఎంటర్‌ కాగలిగిన రంగం ఏదైనా ఉంది అంటే అది కాస్ట్యూమ్స్‌ రంగమనే చెప్పాలి. ఇలా మెగాస్టార్‌ పెద్దకూతురు సుస్మిత కూడా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మారింది. రాజమౌళి భార్య, శ్రీనువైట్ల భార్యలు కూడా ఇదే రంగానికి చెందిన వారే. 

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సుస్మిత తన తండ్రి నటిస్తున్న 'సై..రా...' చిత్రం కోసం కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తూ, మరోవైపు దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రానికి కూడా పనిచేస్తోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు మెగాస్టార్‌ కూతురు తలుచుకుంటే అవకాశాలు కొదువా అని చెప్పాలి. ఇక తాజాగా చిరంజీవి, రామ్‌చరణ్‌ చిత్రం షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాత దానయ్యతో చిరంజీవి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

తాజాగా యూనిట్ మరో పిక్‌ని విడుదల చేసింది. ఇందులో చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్‌ ఒకవైపు, కూతురు సుస్మిత మరోవైపు నిలుచుని ఉండగా ఫొటో దిగాడు. ఈ పిక్‌ ఇప్పుడు మెగాభిమానులకు ఐఫీస్ట్‌లా మారింది. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని, టైటిల్‌ని విజయదశమి కానుకగా విడుదల చేసి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని సమాచారం. దీనిపై యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది...! 

Chiranjeevi, Ram Charan And Sushmita From RC12 Sets at Azerbaijan:

Mega Click From The Sets of RC12 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ