శర్వానంద్ మహానుభావుడు సినిమా హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి పడి పడి లేచె మనసు సినిమా చేస్తున్నాడు. అయితే సినిమా మొదలు పెట్టి చాలాకాలం అయ్యింది. ఇక సినిమాని కూడా నిర్మాతలు డిసెంబర్ 21 విడుదల చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా.. ఫుట్ బాల్ ఆటగాడిగా నటిస్తుండగా సాయి పల్లవి వైద్యురాలి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో పాటుగా... మధ్యమధ్యలో చిత్ర బృందము వదిలిన పడి పడి లేచె మనసు స్టిల్స్ ఆకట్టుకున్నాయి. మహానుబావుడు హిట్ తో ఉన్న శర్వా, వరస హిట్స్ తో ఉన్న సాయి పల్లవిల కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ ఉన్నాయి.
ప్రస్తుతం చివరి షెడ్యూల్ లో ఉన్న ఈ చిత్ర షూటింగ్ అతి త్వరలోనే పూర్తి కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఈ రెండు నెలలు కేటాయించి మంచి ప్రమోషన్స్‌తో హను ఈ చిత్రాన్ని అనుకున్న టైం కి విడుదల చేస్తాడని అనుకుంటున్నారు. అయితే మధ్యలో సాయి పల్లవి మీద కొన్ని రూమర్స్ రావడం, శర్వా, సాయి పల్లవి మీద అలిగి షూటింగ్ కి కొన్ని రోజులు ఎగ్గొట్టాడని.. ఇలా ఏవేవో రూమర్స్ ప్రచారంలో కొచ్చాయి.
ప్రస్తుతం సాయి పల్లవి మీద ఎటువంటి రూమర్స్ గాని, ఆమె గురించిన లేటెస్ట్ సినిమా అప్ సెట్స్ గాని బయటికి రావడం లేదు. ఇక శర్వా కూడా ఎక్కడా బయట ఫోకస్ అవ్వడం లేదు. మరోపక్క శర్వా, సుధీర్ వర్మల సినిమా ఎక్కడి వరకు వచ్చిందో అనేది కూడా ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా హను రాఘవపూడి - శర్వానంద్ ల పడి పడి లేచె మనసు అనుకున్న సమయానికి విడుదలకావడం లేదట. మరి ముందుగా పడి పడి లేచె మనసు డిసెంబర్ 21న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ... ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు వున్నాయట. అయితే ఆ సినిమా వాయిదా ఎందుకు పడుతుందో అనే కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి గత ఏడాది ఇదే టైంలో అంటే దసరాకి శర్వానంద్ జై లవ కుశ, స్పైడర్ చిత్రాలతో పోటీ పడి మహానుభావుడుతో హిట్ కొట్టాడు. కానీ ఈ ఏడాది మాత్రం చడీ చప్పుడు లేకుండా ఉన్నాడు.