Advertisementt

సమంత క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తుంది

Fri 28th Sep 2018 11:14 PM
samantha,glamour roles,mindset,confusion,heroine samantha  సమంత క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తుంది
Samantha.. No one Can Understand Her Mindset సమంత క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తుంది
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పెళ్లయిన హీరోయిన్స్ కి సినిమా అవకాశాలు తగ్గుతాయని నానుడిని బ్రేక్ చేసింది సమంత. నాగ చైతన్య తో ప్రేమలో ఉన్న సమంతకి గత ఏడాది పెద్దగా అవకాశాలే రాలేదు. అలాంటి టైం లోనే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో ఆఫర్ రావడం.. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే సమంత - నాగ చైతన్య ల పెళ్లి కావడం జరిగిపోయాయి. అయితే పెళ్లి తర్వాత సమంత స్టార్ హీరోల సినిమాల్లో అస్సలు కనిపించడం కాదు.. ఆమెకి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గాయి. అదే టైం లో సమంత ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఓకే చెప్తానని చెప్పడం.. ఆతర్వాత మహానటి సినిమా చెయ్యడం జరిగాయి. ఇక పెళ్లి తర్వాత విడుదలైన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక అదే  సమంత స్టార్ హీరో తో చేసిన చివరి సినిమా. ఇక తమిళంలో అభిమన్యుడిలో విశాల్ హీరోగా చేసింది అది హిట్. తర్వాత మొన్న చేసిన సీమ రాజా ప్లాప్. ఇక తెలుగులో లేడి ఓరియంటెడ్ సినిమాగా వచ్చిన యు- టర్న్ హిట్ అయ్యింది.

మరి సమంతకి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి కారణం మాత్రం స్టార్ హీరోలెవరు అక్కినేని కోడలితో రొమాన్స్ చెయ్యాలనుకోకపోవడమే అంటున్నారు. ఇంతకుముందు నాగ చైతన్య తో సమంత ప్రేమలో ఉన్నప్పుడే ఈ ఇలాంటి ప్రచారం జరిగింది.  సమంత హీరోయిన్‌ అని దర్శకులు సజెస్ట్‌ చేసినా కానీ చాలా మంది హీరోలు వద్దని చెప్పేస్తున్నారు. నాగ చైతన్య తో హీరోలకున్న స్నేహం కావచ్చు.. అలాగే టాలీవుడ్ లో సీనియర్ హీరో నాగార్జునపై గౌరవం కావచ్చు అంటూ ప్రచారం జరిగింది. ఇక సమంత ఎప్పుడు గ్లామర్ పాత్రలకు నో అని చెప్పలేదు కానీ... ప్రాధాన్యమున్న పాత్రలనే సరికి చాలామంది సమంత ని లైట్ తీసుకునుండొచ్చు.

ఇకపోతే సమంత మాత్రం గ్లామర్ పాత్రలకు సై అని చెప్పడం లేదని.. గ్లామర్ కి బై బై చెప్పేస్తుంది అనుకునేలోపు.. చైతుతో వెకేషన్స్ లో ఉన్న సమంత టు పీస్ బికినీ తో హాట్ అందాలతో అదరగొట్టే పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి సమంత ఉద్దేశ్యం ఏమిటి స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ షో చేస్తానని చెబుతుందా... లేదంటే ఇక గ్లామర్ షో ఎందుకులే హీరోయిన్ ప్రాధాన్యత పాత్రలు మాత్రమే చేద్దామనుకుంటుందో అనేది క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే నందిని రెడ్డి చెయ్యబోయే సినిమాలో సమంత లేడి ఓరియెంటెడ్ సినిమా కాబట్టే ఒప్పుకుందంటున్నారు. మరో పక్క స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతోనే సమంత ఇలా యు-టర్న్ తీసుకుందనే టాక్ బయలు దేరింది. మరి అసలు సమంతకి అవకాశాలు రావడం లేదా... అసలు నిజంగా వచ్చినా వద్దంటుందా అనేది అర్ధమే అవ్వడం లేదంటున్నారు.

Samantha.. No one Can Understand Her Mindset:

Samantha No to Glamour roles