Advertisementt

బిగ్‌బాస్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలిసిపోయిందోచ్!

Sat 29th Sep 2018 11:57 PM
bigg boss season 2,nani,venkatesh,chief guest,finale  బిగ్‌బాస్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలిసిపోయిందోచ్!
Star Hero Guest for Bigg Boss Grand Finale బిగ్‌బాస్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలిసిపోయిందోచ్!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంది. రేపు అంటే ఆదివారం ఫైనల్ జరగబోతుంది. 110 రోజులు పాటు మనన్ని ఎంటెర్ టైన్ చేసిన పార్టిసిపెంట్స్ ఫైనల్ కి చేరుకున్నారు. చివరికి ఐదుగురు మిగిలారు. ఐదుగురులో ఒక్కరు టైటిల్ విన్నర్ కానున్నారు. సీజన్ మధ్య నుంచి కౌశల్ ఆర్మీ తమ బలాన్ని సోషల్ మీడియాలో చూపుతున్నారు. అందరి కంటే అతనికే ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి అని తెలుస్తుంది. ఆల్రెడీ కొన్ని ఏరియాస్ లో ఫైనల్ ను వీక్షించేందుకు కౌశల్ ఆర్మీ కొన్ని చోట్ల స్క్రీనింగ్ వేసి టికెట్స్ కూడా పెట్టారు.

మరి ఇంత చేస్తున్న కౌశల్ కి టైటిల్ ఇస్తారా? లేదా తనని కాదని వేరే ఎవరికైనా ఇస్తారా? అనే ఆస‌క్తి అంత‌టా నెల‌కొంది. దీని బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఫైనల్ కు చీఫ్ గెస్ట్ ఎవరు? అనే ఉత్సుక‌త కూడా ఉంది. సీజన్ 1 హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్ వస్తాడని వార్త వచ్చాయి. కానీ తన 'అరవింద సమేత' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి అతను రావడం కుదరదు. ఇంకొంతమంది స్టార్స్ కూడా వినిపించాయి. అయితే లాస్ట్ కి బిగ్ బాస్ ఫైన‌ల్‌కి గెస్ట్‌గా వెంక‌టేష్ రానున్నాడ‌ని తెలుస్తోంది.

'మా' బృందం ఆయనను సంప్రదించగా ఓకే చెప్పాడని తెలుస్తుంది. సో వెంకటేష్ చేతుల మీదుగా టైటిల్ ట్రోఫీ ని అందించనున్నారు. బిగ్ బాస్ త‌మిళ వెర్ష‌న్ ఫైన‌ల్‌కి గెస్ట్‌గా విజయ్ దేవరకొండ వెళ్లనున్నాడని తెలుస్తోంది. 'నోటా' ప్రొమోషన్స్ తో బిజీగా ఉన్న విజయ్ ప్రొమోషన్స్ భాగంగా వెళ్లనున్నాడని సమాచారం. అతను నటించిన 'నోటా' సినిమా వచ్చే నెల 5న మన ముందుకు రాబోతుంది.

Star Hero Guest for Bigg Boss Grand Finale:

Venkatesh Chief Guest For Bigg Boss season 2 Finale

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ