Advertisementt

‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’లో ఉన్న సేమ్ సీన్ ఇదే!

Mon 01st Oct 2018 05:49 PM
paruchuri gopala krishna,samarasimha reddy,indra,b gopal,kaikala satyanarayana  ‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’లో ఉన్న సేమ్ సీన్ ఇదే!
Paruchuri Gopala Krishna About Samarasimha Reddy Kaikala Episode ‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’లో ఉన్న సేమ్ సీన్ ఇదే!
Advertisement
Ads by CJ

నాడు ఫ్యాక్షన్‌ చిత్రాల హవా ‘బాషా’ చిత్రంతో మొదలైంది. కొన్ని చిత్రాల వరకు ఇవి బాగానే ఆడాయి. కానీ తర్వాత మాత్రం ప్రేక్షకులు మొనాటనీగా భావించడం మొదలుపెట్టారు. ఇక బాలకృష్ణ నటించిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్ది’ నుంచి ఎన్టీఆర్‌ ‘ఆది, సాంబ, సింహాద్రి’లు కూడా ఇదే ఫార్ములా. ఇదే సమయంలో చిరంజీవి కూడా ‘ఇంద్ర’ చిత్రం చేశాడు. 

ఇక తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ గురించి మాట్లాడుతూ.. ‘సమరసింహారెడ్డి’ కథను విజయేంద్రప్రసాద్‌ రాయగా, నేను, దర్శకుడు బి.గోపాల్‌  కలిసి మద్రాస్‌లోని ఆంధ్రా క్లబ్‌లో కూర్చుని కథ విన్నాం. అందులో కైకాల సత్యనారాయణ కోసం ఓ మంచి పాత్రను క్రియేట్‌ చేయమని బి.గోపాల్‌ గారు కోరారు. దాంతో సత్యనారాయణ గారి కోసం సీమకి చెందిన ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను సృష్టించాం. అది విజయేంద్రప్రసాద్‌కి కూడా బాగా నచ్చింది. ఒకానొక సందర్భంగా ఈ సత్యనారాయణ పోలీస్‌ పాత్ర కనిపించి బాలకృష్ణకి చేతులెత్తి నమస్కారం చేస్తుంది. అలా చేస్తే బాలకృష్ణనే సమరసింహారెడ్డి అనేది తెలిసి పోతుందని విజయేంద్రప్రసాద్‌ అన్నారు. 

థియేటర్‌కి వచ్చేవారు బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ అని ఊహించే వస్తారుగానీ బ్రహ్మానందం అనుకొని రారు... అని నేను చెప్పాను. ఈ పాయింట్‌ బి.గోపాల్‌కి బాగా నచ్చింది. ఆ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ ‘సమరసింహారెడ్డి’కి నమస్కరించే సన్నివేశం రజనీకాంత్‌కి ఎంతో నచ్చిందట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ‘ఆ ఒక్క సీన్‌తో హీరో పాత్రని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు’ అని ఆయన ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చాడు. 

అయినా సీమ కథలంటే హీరో ఎక్కడో అనామకునిగా పని చేస్తూ ఉండటం, ఓ గొప్ప వ్యక్తి ఆయనకి నమస్కరించడం, దాని వెంటనే ఆ హీరో సీమలో అదిరిపోయే నాయకుడని పవర్‌ఫుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో చూపించడం కామనైపోయింది. ఎందుకంటే ఇదే పరుచూరి వారు.. ఇంద్రలో కూడా ప్రకాష్‌రాజ్‌ చిరంజీవికి నమస్కరించే సీన్స్‌ని పెట్టారు. 

Paruchuri Gopala Krishna About Samarasimha Reddy Kaikala Episode:

Paruchuri Gopala Krishna About Samarasimha Reddy story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ