తెలుగు మూడు నాలుగు సినిమాలతోనే తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అక్కడ 'నోటా' అనే సినిమా చేసి ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ దేవరకొండ. అయితే తెలుగులో ఈ సినిమాకు ఏ సినిమా పోటీ లేదు. కానీ తమిళంలో మాత్రం విజయ్ సేతుపతి.. త్రిష కాంబినేషన్ లో 96 అనే చిత్రం దీనికి పోటీగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రెస్ షోను నిన్న చెన్నైలో వేశారు. ప్రెస్ షో నుండి 96కి అత్యుత్తమ స్పందన లభిస్తోంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు దీన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అక్కడ వెబ్సైట్ లో, న్యూస్ పేపర్స్ లో రేటింగ్స్ బాగా వస్తున్నాయి. సో ఈ చిత్రంకి ముందు నుండే పాజిటివ్ టాక్ వచ్చేసింది.
ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు దిల్ రాజు రైట్స్ కొన్నారు. ఇందులో సమంత, నాని నటించే అవకాశముంది. మరి ఈ పోటీని 'నోటా' తట్టుకుంటుందా? అంటే అది డిఫరెంట్ స్టోరీ అది డిఫరెంట్ స్టోరీ అంటున్నారు. సో రెండింటిని ఎంకరేజ్ చేసేవారు చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. ఇది పొలిటికల్ డ్రామా కాబట్టి తెలుగులో కూడా 'గీత గోవిందం' రేంజ్ రెస్పాన్స్ రావడం కష్టమే అనిపిస్తోంది. మరి ఎలా ఉంటుందో చూడాలి. రీసెంట్ గా ఈ సినిమాను ఆపాలని డేంజర్ నోటీసులు జారీ అయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.