Advertisementt

కౌశల్‌ ఆర్మీ చేత తిట్లు తింటోంది..!

Thu 04th Oct 2018 09:22 PM
tejaswi madivada,sensational tweets,bigg boss winner,kaushal,kaushal army,trolls  కౌశల్‌ ఆర్మీ చేత తిట్లు తింటోంది..!
Kaushal Army Trolls Tejaswi Madivada కౌశల్‌ ఆర్మీ చేత తిట్లు తింటోంది..!
Advertisement
Ads by CJ

సామాజిక బాద్యత, తమ అభిప్రాయాలు తెలిపే స్వాతంత్య్రం ఉందని చెప్పి ప్రతి విషయంలోనూ స్పందిస్తే మంచికిపోతే చెడు ఎదురైన పరిస్థితి వస్తుంది. ఇక విషయానికి వస్తే ఎలాగైతేనేం కౌశల్‌ బిగ్‌బాస్‌ సీజన్‌2 విజేతగా నిలిచాడు. ప్రేక్షకుల మద్దతు, ఓట్లు ఉండబట్టే ఆయన అందరినీ మెప్పించాడు కాబట్టే విజేత కాగలగాడనేది వాస్తవం. కానీ ఫలితం వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుల మనోభావాలను పట్టించుకోకుండా పక్కవారికి బాధకలిగేలా మాట్లాడితే ఏమవుతుందో ప్రస్తుతం తేజస్వికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది. 

ఈ షోలో మొదటి నుంచి కౌశల్‌కి వ్యతిరేకంగా బిహేవ్‌ చేసిన నటి తేజస్వి.. ఈ షో ముగిసిన తర్వాత కూడా కోడిగుడ్డుకి ఈకలు పీకేలా మాట్లాడింది. అమిత్‌, పూజ, భానుశ్రీ, రోల్‌రైడా, గణేష్‌, శ్యామల, బాబుగోగినేని కలసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడమే కాదు.. అసలు విజేతలు వీరేనంటూ కామెంట్‌ పెట్టింది. ఈ వ్యాఖ్యలపై కౌశల్‌ ఆర్మీ మండిపడుతోంది. పై నుంచి కింది వరకు ఆమె విషాన్ని నింపుకుంది. చాలా చీప్‌, స్టుపిడ్‌, షేమ్‌లెస్‌, మరొకరి విజయాన్ని ఆమోదించలేకపోతున్నావు... అభినందించలేకపోతున్నావు. మా కౌశల్‌ మీద అసూయతో ఏడ్చి చచ్చిపోతోంది. నీవు ఎప్పటికీ లూజరే.. ఇప్పటికీ ఎప్పటికీ కౌశలే విజేత అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. 

ఇదంతా చూస్తుంటే ఎన్నికల్లో నిలబడి, డిపాజిట్‌ కూడా రాకుండా ఓడిపోయినా, ప్రజాతీర్పు అది అని ఒప్పుకోకుండా తాము గెలిస్తే ప్రజాతీర్పు అని, ఓడిపోతే ఎదుట గెలిచిన వారు డబ్బులు ముందు పంచి అక్రమంగా గెలిచారని ఆరోపించే రాజకీయాల తరహాలోనే ఇది కూడా ఉందని చెప్పవచ్చు. 

Kaushal Army Trolls Tejaswi Madivada:

Tejaswi Madivada sensational tweets on Bigg Boss Winner Kaushal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ