Advertisementt

ప్రభాస్ ఎవరో తెలియదంటూ షాకిచ్చింది

Fri 05th Oct 2018 08:13 PM
lovieratri,heroine,aayush sharma,warina hussain,aayush sharma,prabhas  ప్రభాస్ ఎవరో తెలియదంటూ షాకిచ్చింది
LoveRatri Heroine Shocking Comments on Prabhas ప్రభాస్ ఎవరో తెలియదంటూ షాకిచ్చింది
Advertisement
Ads by CJ

ఏ అభిమానికైనా తమ వీరాభిమాన హీరో గురించి మాకు తెలియదు అంటే కోపం నషాళానికి అంటుంది. అందునా ఇప్పుడు సోషల్‌మీడియా వల్ల వారిపై అభిమానుల ట్రోలింగ్‌ మామూలుగా ఉండదు. గతంలో అలియాభట్‌తో పాటు కొందరు బాలీవుడ్‌ హీరోయిన్లు ఫలానా తెలుగు హీరోతో కలిసి మీరు నటిస్తున్నారట కదా..! అని అడిగితే అక్కినేని ఫ్యామిలీ హీరో అయిన అఖిల్‌ నుంచి మహేష్‌బాబు వరకు ఎవరో మాకు తెలియదని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నవారే. వినడానికి, చూడటానికి ఇది చిన్న విషయమే అయినా దానినే అభిమానులు కసిగా తీసుకుంటారు. అక్కినేని అఖిల్‌తో నటించడం గురించి అలియాభట్‌ అతనెవరో నాకు తెలియదని వ్యాఖ్యానించడంతో దేశంలోనే సినీ ఫ్యామిలీలలో ప్రముఖమైన అక్కినేని కుటుంబం గురించి తెలియకపోవడం ఏమిటని నాడు అలియాభట్‌ని అందరు ఓ ఆటాడుకున్నారు. ఇక అలియాభట్‌కి దేశప్రధాని, రాష్ట్రపతుల పేర్లు కూడా తెలియవని అంతకు ముందే మీడియా ద్వారా బయటపడటంతో ఈమెని వెక్కిరిస్తూ నానా విధాలుగా ఆమెని ట్రోల్‌ చేశారు. ఇప్పుడు అలాంటి మరో సంఘటన ముదిరి పాకానపడక ముందే పక్కనే ఉన్న హీరో ఆ హీరోయిన్‌ని తనదైన కవరింగ్‌తో కాపాడి దేవుడిలా మారాడు. 

విషయానికి వస్తే సల్మాన్‌ఖాన్‌ సొంత చిత్రంగా బాలీవుడ్‌లో రూపొందుతున్న చిత్రం 'లవ్‌యాత్రీ'. వరీన్‌హుస్సేన్‌, ఆయుష్‌శర్మ జంటగా నటించిన ఈ చిత్రం 5వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయుష్‌శర్మ, వరీన్‌హుస్సేని హైదరాబాద్‌కి వచ్చి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఏ బాలీవుడ్‌ నటులు కనిపించినా మీకు ఇష్టమైన హీరో ఎవరు? మీకిష్టమైన చిత్రం ఏమిటి? తెలుగులో ఏ హీరోతో చేయాలని ఉంది? వంటివి మీడియా జనాలు గొప్పగా సంధించే ప్రశ్నలు. ఏమైనా పొరపాటు మాట్లాడితే దానిని హైలైట్‌ చేసి ఓ వారం రోజులు దానిని హాట్‌టాపిక్‌ చేయాలని భావిస్తూ ఉంటారు. 

ఇక ఈ 'లవ్‌యాత్రీ' మీడియాతో కలిసి మాట్లాడిన సందర్బంగా టాలీవుడ్‌ చిత్రాల గురించి ఏదేదో హైదరాబాద్‌ వస్తున్నామని తెలుసుకుని నానా ప్రశంసలు కురిపించకుండా హీరోయిన్‌ వరీన్‌హుస్సేని నిజం మాట్లాడింది. తనకు టాలీవుడ్‌ చిత్రాల గురించి పెద్దగా తెలియదని, కానీ 'బాహుబలి' చిత్రం చూశానని చెప్పింది. కానీ హీరో ప్రభాస్‌ గురించి అడిగితే నిజంగా ఆయన గురించి తనకు తెలియదని బదులిచ్చింది. వెంటనే హీరో ఆయుష్‌శర్మ కల్పించుకుని ఆమె ఆఫ్గానిస్తాన్‌ అమ్మాయి అని, అందుకే చెప్పలేకపోయిందని చెబుతూ, తన సహనటి తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని చెప్పి వివాదం ముదరకుండా ఎలాగోలా వరీన్‌హుస్సేన్‌ని కాపాడాడనే చెప్పాలి. ఎంతైనా అతని సమయస్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే..! 

LoveRatri Heroine Shocking Comments on Prabhas:

LoveRatri Promotions in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ