Advertisementt

అఖిల్, ప్రియా.. వాట్ ఏ కాంబో..?

Mon 08th Oct 2018 04:28 PM
akhil,priya varrier,ad,made for each other  అఖిల్, ప్రియా.. వాట్ ఏ కాంబో..?
Akhil and Priya Varrier Combo in Ad అఖిల్, ప్రియా.. వాట్ ఏ కాంబో..?
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్‌... అక్కినేని అభిమానులు నాగచైతన్యకంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న వారసుడు. నాగచైతన్య మాత్రం మొదటి చిత్రం ‘జోష్‌’తో నిరాశపరిచినా కూడా రెండో చిత్రం ‘ఏ మాయచేశావే’తో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అనవసర ప్రయోగాలకంటే తమ ఫ్యామిలీకి బాగా అచ్చివచ్చిన క్లాస్‌, ఫ్యామిలీ చిత్రాల ద్వారా మొదట్లో తనవంతు ప్రయత్నాలు చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత మాస్‌, యాక్షన్‌ చిత్రాలతో ‘తడాఖా’తో వచ్చి తాజాగా ‘సవ్యసాచి’ వంటి డిఫరెంట్‌ చిత్రంతో రానున్నాడు. అదే అఖిల్‌ విషయానికి వస్తే ఈయన తెరంగేట్రంతోనే వినాయక్‌ వంటి దర్శకునితో లోకాన్ని రక్షించే బరువైన పాత్ర చేసి దెబ్బతిన్నాడు. రెండో చిత్రం ‘హలో’ ఫర్వాలేదనిపించినా కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌ కాలేదు. 

ఇక ఇప్పుడు ప్లేబోయ్‌ తరహా పాత్రలో ‘మిస్టర్‌ మజ్ను’ అంటూ.. ‘తొలిప్రేమ’ వంటి మొదటి చిత్రంతోనే సత్తా చాటుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. నిజానికి అఖిల్‌ సినిమాలలోకి ఎంటర్‌ కాక ముందే వాచ్‌లు, డ్రింక్స్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా, యాడ్స్‌ ద్వారా ఆకట్టుకున్నాడు. మరి ఆయనకు ఇంత మంచి అవకాశాలు హీరోగా నిలబడకముందే ఎలా వచ్చాయి? అనే దానిపై భిన్నవాదనలు ఉన్నాయి. 

తన తండ్రి నాగార్జున పలుకుబడితోనే ఆయనకు ఆ అవకాశాలు వచ్చాయని కొందరు వాదిస్తారు. నిజానికి ఒక్క సినిమా విడుదలకాకముందే ఆయనకు యాడ్స్‌ ద్వారా వచ్చిన గుర్తింపు చూసిన అక్కినేని అభిమానులు మహేష్‌ తర్వాత ఆ రంగంలో ఇతనే భవిష్యత్తు స్టార్‌గా చెప్పుకున్నారు. ఇక తాజాగా అఖిల్‌ మరో యాడ్‌లో నటించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఒక్క కన్నుగీటుతోనే ఇంకా తన మొదటి చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’ విడుదల కాకుండానే సంచలనం సృష్టించిన మలయాళ బ్యూటీ ప్రియావారియర్‌.. అఖిల్‌తో కలిసి ఉన్న వీడియో వైరల్‌ అవుతోంది. 

వీరిద్దరు కలిసి ఏ చిత్రంలో నటించారు? అని ఆశ్యర్యపోవద్దు. గతంలో తన తండ్రితో కలిసి సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌లో నటించిన అఖిల్‌ ఈసారి ప్రియాతో వచ్చాడు. ఇక అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’గా మూడో చిత్రంతో రానుండగా, ప్రియా మొదటి చిత్రం ఇంకా విడుదల కాలేదు. తదుపరి చిత్రం ఇంకా ఒప్పుకోలేదు. మరి నిజంగా అఖిల్‌, ప్రియా వారియర్‌ కలిసి ఓ చిత్రంలో జంటగా నటిస్తే చూడాలనే ఆసక్తి, ఈ యాడ్‌ చూసిన తర్వాత అందరిలో కలగడం ఖచ్చితమనే చెప్పాలి. వీరిద్దరు అంత చూడచక్కగా మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనేలా ఉన్నారు మరి.

Akhil and Priya Varrier Combo in Ad:

Akhil and Priya Varrier.. made for each other

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ