Advertisementt

ఈ అమ్మాయ్ లైఫ్.. త్రినాధరావు చేతుల్లో..!!

Tue 09th Oct 2018 03:00 PM
anupama parameswaran,trinadharao nakkina,hello guru prema kosame,heroine  ఈ అమ్మాయ్ లైఫ్.. త్రినాధరావు చేతుల్లో..!!
This Heroine life in Trinadharao Hands ఈ అమ్మాయ్ లైఫ్.. త్రినాధరావు చేతుల్లో..!!
Advertisement
Ads by CJ

తెలుగులోకి  వచ్చిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్‌కి ఆ తర్వాత ఆమెకు టైం అంతగా కలిసి రాలేదు. తెలుగులో ఒక్కప్పుడు యూత్ తో పాటు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ మలయాళీ బొమ్మ రీసెంట్ గా నటించిన  ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘తేజ్‌ ఐలవ్యూ’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలు వరసగా ప్లాప్ అవ్వడంతో ఆమె అవకాశాలు తగ్గాయి.

ఈమూడు సినిమాలు ఫెయిల్ అయ్యాయి కానీ ఆమె పర్‌ఫార్మెన్స్‌ బాగా నచ్చడంతో రామ్‌ తన నెక్స్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం అనుపమ.. రామ్ జంటగా ‘హలో గురూ ప్రేమకోసమే’ అనే సినిమాలో నటిస్తున్నారు. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈసినిమాకి కూడా అనుకున్నంత బజ్ లేదు. రీసెంట్‌గా రిలీజ్ అయినా టీజర్.. రెండు సాంగ్స్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ పెంచట్లేదు.

దానికి తోడు దిల్ రాజు, రామ్, అనుపమ కొన్ని సినిమాల నుండి ఫామ్ లో లేరు. అయితే ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు త్రినాధరావు నక్కిన మాత్రం ఊపు మీద వున్నాడు. ఆయన డైరెక్షన్ లో ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్‌’ చిత్రాలతో వినోదాత్మక చిత్రాలు అందిస్తాడనే పేరు అతనికి వుంది. సో ఈ సినిమా రిజల్ట్ అతనిపైనే ఆధారపడి ఉంది. అసలే పోటీ వాతావరణంలో వస్తోన్న ఈ చిత్రం ఎంతవరకు నిలదొక్కుకుంటుందనేది చూడాలి. ఈసినిమా హిట్ అయితే పర్లేదు.. హిట్ కాకపోతే అనుపమకు తెలుగులో కష్టాలు మొదలైనట్లే. 

This Heroine life in Trinadharao Hands:

Anupama Parameswaran Hopes on Director Trinadharao Nakkina 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ