Advertisementt

మరో గొప్పనటుడి వారసుడి ఎంట్రీకి సర్వం సిద్ధం!

Tue 09th Oct 2018 03:06 PM
actor nassar son,debut,kamal haasan banner  మరో గొప్పనటుడి వారసుడి ఎంట్రీకి సర్వం సిద్ధం!
Great Actor Son Ready to Turn Hero మరో గొప్పనటుడి వారసుడి ఎంట్రీకి సర్వం సిద్ధం!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’తో నాజర్‌ అందరికీ పరిచయం అయ్యాడని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఆయన పేరు ఎప్పుడో దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకటిగా ఉంది. ముఖ్యంగా కమల్‌హాసన్‌ నుంచి మహేష్‌బాబు వరకు ఆయన తమ చిత్రాలలో నటించాలని ఆశపడుతూ ఉంటారు. నిజానికి నాజర్‌.. చిరంజీవి, రజనీకాంత్‌ల కంటే ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్‌లో టాపర్‌. ఆయన హోటల్‌లో బేరర్‌గా చేస్తూ నటునిగా తన సత్తా ఏమిటో చాటాడు. ఇంక ఎంతో కాలం తర్వాత ఆయన చిరంజీవితో కలిసి ‘ఖైదీనెంబర్‌ 150’లో నటించాడు. 

ఇక విషయానికి వస్తే నాజర్‌కి నటునిగా ఎంత పేరుందో తెలిసిన వారందరూ.. త్వరలో తెరంగేట్రం చేయబోతున్న ఆయన రెండో కుమారుడు అబీమొహది ఎలాంటి నటనా సత్తాచాటుతాడు? తన తండ్రి వారసత్వాన్ని, ఆయన అద్భుతమైన నటనను తాను కూడా చూపించే సత్తా ఉందా? అనేందుకు ఎదురు చూస్తున్నారు. తన కుమారుడి కోసం ఎందరో నిర్మాతలు, దర్శకుల కథలు విన్నతర్వాత నాజర్‌ చివరగా తన కుమారుడి అరంగేట్రం మూవీని తనకి అత్యంత స్నేహితుడైన కమల్‌హాసన్‌ చేతికి అప్పగించాడు. కమల్‌కి చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ బేనర్‌లో నాజర్‌ కుమారుడి మొదటి చిత్రం ఖరారైంది. దీనికి తగ్గ సన్నాహాలలో నాజర్‌ కూడా బిజీగా ఉన్నాడట. 

ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. వచ్చే నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌తో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎలాంటి బిల్డప్‌లు, హీరోయిజాలకు తావు లేని ఓ కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీగా ఇది రూపొందనుందని సమాచరం. దర్శకుని పేరును మాత్రం రహస్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం కమల్‌.. విక్రమ్‌ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలో నటీనటులను సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు. ఈ చిత్రం తెలుగులోకూడా ఒకేసారి ద్విభాషా చిత్రంగా రూపొందిస్తారా? అలా కాకపోయిన కనీసం అనువాదమైనా చేస్తారా? అనేవి వేచిచూడాల్సివుంది..!

Great Actor Son Ready to Turn Hero:

>Actor Nazar Son to Act with Three Heroines in upcoming Next Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ