Advertisementt

కాజల్ కావాలంటే.. అంత ఇవ్వాల్సిందే!!

Tue 09th Oct 2018 03:15 PM
kajal agarwal,remuneration,hiked,heroine  కాజల్ కావాలంటే.. అంత ఇవ్వాల్సిందే!!
Kajal Agarwal Hiked her Salary కాజల్ కావాలంటే.. అంత ఇవ్వాల్సిందే!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ చందమామ కాజల్‌కు తెలుగులో క్రేజ్ తగ్గిందా? చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఒక్కప్పుడు తెలుగులో వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోస్ పక్కన చేస్తూ చాలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్. దాదాపు దశాబ్ద కాలంగా టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ అమ్మడు నటిగా మంచి పేరు తెచ్చుకుంది. దాంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. 

అప్పటిలో రెండు కోట్ల వరకు పారితోషికం వసూలు చేసిన ఈ అమ్మడికి క్రేజ్ తగ్గడంతో రెమ్యూనరేషన్ తగ్గించేసింది. మళ్లీ తెలుగులో, తమిళంలో కొన్ని సినిమాల తర్వాత తిరిగి ఫామ్ లోకి రావడంతో రెమ్యూనరేషన్ కూడా యాజిటీజ్ గానే పెంచేసింది. ప్రస్తుతం కాజల్ 1.75 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. హీరో ఎవరు అనేది చూడకుండా అతని పక్కన యాక్ట్ చేయడానికి రెడీ అంటుంది. 

కాజల్ కు చాలామంది యంగ్ హీరోస్ పక్కన నటించేందుకు అవకాశాలు వస్తున్నాయి. అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం మేము అంత ఇచ్చుకోలేం అంటున్నారు. దాంతో ఆమె ఆ ప్రాజెక్ట్స్ ను రిజెక్ట్ చేస్తుందని సమాచారం. రీసెంట్ గా తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన చేస్తున్న సినిమాకి కూడా అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుందట. డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో కాజల్ హీరోయిన్ గా కావాలంటే ఆమె అడిగినంత ఇవ్వాల్సిందే అనమాట.

Kajal Agarwal Hiked her Salary:

Kajal Agarwal Remuneration Hiked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ