తెలుగు జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలనే అడుగుతారని, ఒక సినిమా ప్రమోషన్స్ విషయంలో లేవనెత్తే విషయాలనే తదుపరి పది చిత్రాల తర్వాత కూడా అవే నటీనటులకు సంధిస్తూ ఉంటారనే విమర్శ ఉంది. ఇది ఫిల్మ్‌జర్నలిజంలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ప్రెస్‌మీట్‌కి అందునా స్టార్స్ వద్దకి వెళ్లి ప్రశ్నించేటప్పుడు సమయానుకూలంగా, ఆయా పరిస్థితులను, గతంలో ఏయే ప్రశ్నలు వారిని అడిగాం? ఏం రిపీట్ చేస్తే వినేవారికి, చెప్పేవారికి, చదివేవారికి చికాకు తెప్పించకూడదు? అనేవిషయాలపై తగిన హోం వర్క్ చేయాలని సీనియర్ జర్నలిస్ట్‌లు సలహా ఇస్తుంటారు. దీనికి తాజాగా నాగార్జున ఓ ప్రశ్నపై చికాకు వ్యక్తం చేయడమే ఉదాహరణ.
నాగ్ గతంలో తన ఫుడ్ తానే వండుకుంటానని, ఫిట్నెస్ అనేది శారీరకంగా తనకు మొదటి నుంచి వచ్చిందని, హెల్త్ కాన్షియస్, క్రమశిక్షణ, ప్లానింగ్, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే తన ఫిట్నెస్ రహస్యాలుగా చెప్పాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పేపర్లు చదవి, టివీలు చూసిమనసు చెడగొట్టుకోను. ఇక మీ ఫిట్‌నెస్ రహస్యం ఏమిటని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే నాకు పిచ్చకోపం వస్తుంది. చిరాకు వేస్తుంది. నేను ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న రిపీట్‌అవుతూ ఉంటుంది. దీనికి తోడు నా గురించి ప్రస్తావించాల్సి వస్తే 59 ఏళ్ల నాగార్జున అంటూ వ్యాఖ్యానిస్తారు. ఇది నా ఒక్కడికి మాత్రమే జరుగుతోందేమో..!
మల్టీస్టారర్ మూవీ కావడంతో ‘దేవదాస్’లో నానితో పోటీ పడి నటించాల్సివచ్చింది... అని చెప్పుకొచ్చాడు. ఇక గతంలో ఏయన్నార్, శోభన్‌బాబులను సైతం ఇదే తరహా ప్రశ్నలతో ఎక్కడికి వెళ్లినా ప్రశ్నించేవారనేది సీనియర్లకు తెలిసిన విషయమే.