భారతీయ సినీ గాయకునిగా, అద్భుతమైన జానపద సింగర్‌గా తనదైన జానపదాన్ని పాప్ సంగీతాన్ని జోడించి పాటలు పాడి అలరించడంలో ఒకరు ఖైలాష్ఖేర్. ఈయన దేశంలోని ఎన్నో భాషలతో పాటు తెలుగులో కూడా 'పరుగు, అరుంధతి, ఆకాశమంత, మిర్చి, బాహుబలి' వంటి ఎన్నో భారీ చిత్రాలలోని పాటలు పాడి తెలుగు సంగీత ప్రియుల మనస్సులో గొప్పస్థానం సాధించాడు. ఇక విషయానికి వస్తే తాజాగా బాలీవుడ్ గాయని సోనా మహాపాత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. ఖైలాష్ఖేర్ తన వంటి మీద చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆయనపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారుతున్నాయి.
ఒకరోజు కాఫీ కేఫ్‌లో ఖైలాష్ఖేర్ని కలిశాను. తామిద్దరం కలిసి ఓ సంగీత కచ్చేరి చేయాల్సివుండటంతో ఆయనను కలిసి సమావేశం కావాల్సివచ్చింది. ఆ సమయంలో ఖైలాష్ నాపై వేయకూడని ప్రాంతాలలో చేతులు వేశాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావని అంటూ వేధించాడు. దాంతో నేనక్కడ ఉండలేక వెళ్లిపోయాను. అక్కడితో ఆయన నన్ను వదిలిపెట్టలేదు. కచ్చేరి సందర్భంగా తన రూమ్‌కి రమ్మని నన్ను వేధించాడు. అందువల్లే ఆయన ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం ఆపేశాను. చివరకు నిర్వాహకులకు ఫోన్ చేసి విషయం మాట్లాడాను. గతంలో ఖైలాష్ నా స్టూడియోలో ఎన్నో పాటలు పాడాడు. అతనికి ఇలాంటి బుద్ది ఉందని తెలిస్తే అసలు దగ్గరకు కూడా రానిచ్చేవాడిని కాదు.
ఇలాంటి వ్యక్తి తానెంతో సింపుల్ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఖైలాష్ ఖేర్, సోనా మహాపాత్రనే కాకుండా విలేకరి సంధ్యామీనన్ని కూడా వేధించాడట. ఖైలాష్ తనకు పంపిన అసభ్య మెసేజ్‌ల స్క్రీన్షాట్లను ఆమె బయటకు లీక్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో సదరు విలేకరికి ఆయన క్షమాపణలు చెప్పాడు. దీనిపై సంధ్యామీనన్ ఘాటుగా స్పందిస్తూ, ఎంతమంది ఆడవాళ్లకు క్షమాపణలు చెబుతావు కైలాష్..? ఇప్పటి నుండే మొదలుపెడితే మీ బాధితులందరికీ క్షమాపణలు చెప్పడానికి జీవిత కాలం పడుతుంది.. అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది.