హీరో నానికి ఈమధ్య అంతగా కలిసి రావట్లేదని చెప్పాలి. తను ఏ సినిమా చేసిన అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. రీసెంట్ గా నాగార్జున - నాని కాంబినేషన్ లో వచ్చిన 'దేవదాస్' చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నాని కొత్త డైరెక్టర్ తో ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ.
ఇందులో క్రికెటర్ పాత్రలో నాని కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది ఇంతవరకు కన్ ఫర్మ్ అవ్వలేదు. గత కొన్ని నెలలు నుండి హీరోయిన్ వేట జరుగుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. శ్రద్ద శ్రీనాధ్ అనే కొత్త అమ్మాయి టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది.
అంతకముందు కన్నడ ‘యూటర్న్’లో ఈమె హీరోయిన్ గా నటించింది. కోలీవుడ్ లో అజిత్ సరసన ‘విక్రమ్ వేద’ సినిమాతో పాపులర్ అయింది. నిజానికి 'దేవదాస్' చిత్రంలోనే శ్రద్ద శ్రీనాధ్ తీసుకుందాం అనుకున్నారట కానీ అది కుదరకపోవడంతో ఇప్పుడు ‘జెర్సీ’ సినిమాలో తీసుకుంటున్నారని టాక్. కొత్త దర్శకుడు గౌతమ్నూ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుద్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం నాని ఈ సినిమా కోసం క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.