Advertisementt

దసరాకి ‘2 స్టేట్స్‌’ ఫస్ట్‌లుక్ వదులుతున్నారు

Mon 15th Oct 2018 03:48 PM
2 states,adivi sesh,shivani rajasekhar,venkat reddy kuncham,vijayadasami  దసరాకి ‘2 స్టేట్స్‌’ ఫస్ట్‌లుక్ వదులుతున్నారు
‘2 States’ First Look for Vijayadasami దసరాకి ‘2 స్టేట్స్‌’ ఫస్ట్‌లుక్ వదులుతున్నారు
Advertisement
Ads by CJ

ల‌క్ష్య ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్‌లో రూపొందిస్తున్న చిత్రం ‘2 స్టేట్స్‌’. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల ‘2 స్టేట్స్‌’ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వెంక‌ట్ రెడ్డి ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎం.ఎల్‌.వి స‌త్యనారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ను విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎం.ఎల్‌.వి. స‌త్యనారాయ‌ణ‌ (స‌త్తిబాబు) మాట్లాడుతూ.. ‘‘బ్యూటీఫుల్, క్యూట్ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అడివిశేష్‌, శివాని పెయిర్ చ‌క్కగా ఉంది. సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నాం. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కోల్‌క‌తాలో రెండు షెడ్యూల్స్‌, హైద‌రాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. డైరెక్టర్ వెంక‌ట్‌రెడ్డి సినిమాను ఆద్యంతం చ‌క్కగా తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

ద‌ర్శకుడు వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 22 నుంచి హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ ఖర్చుతో ఓ పెళ్లి పాటను జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీక‌రిస్తాం. త‌దుప‌రి విదేశాల్లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉంది. దీంతో టాకీ మొత్తం పూర్తవుతుంది. అహ్లాద‌క‌రంగా సాగిపోయే ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది’’ అన్నారు.

అడివి శేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, ర‌జ‌త్ క‌పూర్‌, భాగ్యశ్రీ, లిజి, ఆదిత్య మీన‌న్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖరామ‌న్‌, హేమ‌, ఉత్తేజ్ త‌దితరులు ఈ చిత్రంలో నటించారు.

‘2 States’ First Look for Vijayadasami:

‘2 States’, starring Adivi Sesh and Shivani Rajasekhar in lead roles, is directed by debutant Venkat Reddy Kuncham.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ