Advertisementt

మెలోడీకింగ్‌ సింగర్‌పై ‘మీటూ’ ఆరోపణలు!

Mon 15th Oct 2018 11:58 PM
singer karthik,metoo heat,sandhya menen,metoo allegations,karthik,chinmayi  మెలోడీకింగ్‌ సింగర్‌పై ‘మీటూ’ ఆరోపణలు!
MeToo Allegations on Star Singer Karthik మెలోడీకింగ్‌ సింగర్‌పై ‘మీటూ’ ఆరోపణలు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నటీమణులు, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై 'మీటూ' ఉద్యమం ఊపందుకుంది. ఇందులో ఎందరి పేర్లో వినిపిస్తున్నాయి. స్వయాన బిగ్‌బి బాగోతం కూడా బయటపెడతానని హెయిర్‌ స్టైలిస్ట్‌ సప్నా చెప్పుకొచ్చింది. ఇక అందరు దేవుడిలా భావించే అమితాబ్‌తో పాటు నానాపాటేకర్‌ వంటి సంఘసేవకునిపై కూడా ఆరోపణలు ముసురుకుంటున్నాయి. ఇక తెలుగులో రాజ్‌తరుణ్‌తో 'రాజుగాడు', సందీప్‌కిషన్‌తో 'మనసుకు నచ్చింది', ధనుష్‌తో 'అనేగన్‌' ( తెలుగులో 'అనేకుడు') చిత్రాలలో నటించిన అమైరా దస్తూర్‌ సౌత్‌లోని ఓ హీరో తనని లైంగికంగా వేధించాడని, అతను ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి అని తెలిపింది. దీంతో సుచీలీక్స్‌ నుంచి పలు వివాదాలతో సంబంధం ఉందని భావిస్తున్న ధనుష్‌ మీదకే అందరి అనుమానాలు వెళ్తున్నాయి. ఇక సింగర్‌ చిన్మయి శ్రీపాద.. వైరముత్తుపై ఆరోపణలు చేసింది. దీనిని ఆమె తల్లి కూడా తానే సాక్షినని ప్రకటించింది. ఈ ఘటన సింగపూర్‌లో జరిగిందని తెలిపింది. 

ఇక చిన్మయి కన్నడ సంగీత దర్శకుడు రఘుదీక్షిత్‌పై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ పాట సందర్బంగా తనని తన స్నేహితురాలిని వేధించాడని, ఇంటికి రమ్మని చెప్పాడని ఆమె తెలిపింది. ఇందులో నిజమే ఉందని ఒప్పుకున్న రఘుదీక్షిత్‌ ఆమెకి సారీ చెప్పాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో సింగర్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తనదైన అద్భుతమైన, మధురమైన గాత్రంతో మెలోడీ కింగ్‌ సింగర్‌గా పేరు తెచ్చుకున్న కార్తీక్‌పై ఓ అజ్ఞాత మహిళ ఫిర్యాదు చేసింది. తాను వేధింపులకు గురయ్యానని ప్రకటించిన మహిళ.. జర్నలిస్ట్‌ సంధ్యామీనన్‌కి మెసేజ్‌ చేసింది. తాను కూడా సింగర్‌ కార్తీక్‌ బాధితురాలినేనని ఆమె చేసిన మెసేజ్‌ని సంధ్యామీనన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా షేర్‌ చేసింది. 

ఇందులో ఆ అజ్ఞాతమహిళ 'హాయ్‌ సంధ్య.. నేను సింగర్‌ కార్తీక్‌ గురించి మాట్లాడాలి. ఈ విషయంలో నేను గుర్తు తెలియని మహిళగా ఉండటమే మంచిది. కొన్నాళ్ల కిందట నేను, కార్తీక్‌ ఓ బహిరంగ కార్యక్రమానికి వెళ్లాం. అక్కడ కార్తీక్‌ నా శరీరం గురించి తప్పుగా మాట్లాడారు. నన్ను ముట్టుకోవాలని ఉందంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఆరోజు నేను ఏ మాత్రం సౌకర్యంగా ఉండలేకపోయాను. కార్తీక్‌పై అసహ్యం పుట్టింది. ఆయనను కలవాల్సిన ప్రతిసారి నేను భయపడి పోయేదానిని. ఆయన ఎంతో పేరున్న గాయకుడు. పరిశ్రమలో ఎంతో పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి. కనుక నేను ఎవరో తెలియకుండా ఉండటమే మంచిదని భావిస్తున్నాను. టూర్స్‌కి వెళ్లినప్పుడు మహిళా సింగర్స్‌ని లైంగికంగా వేధించే ఆ వ్యక్తికి సిగ్గు లేదు అని తెలిపింది. మరీ కార్తీక్‌ కూడా రఘుదీక్షిత్‌లా ఒప్పుకుంటాడా? లేక ఖండిస్తూ, తన వాదన ఎలా వినిపిస్తాడో వేచిచూడాల్సివుంది...! 

MeToo Allegations on Star Singer Karthik:

Singer Karthik feels MeToo heat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ