టాలీవుడ్ లో సెన్సేషన్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఇతని సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. ఇతను తీసే కొన్ని సీన్స్ సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్తాయి. చాలాసార్లు త్రివిక్రమ్ సీన్స్ ని కాపీ చేసి తన సినిమాల్లో వాడుకోవటం వంటివి చూసాం. అయితే కాపీ అనే పదం ఫ్యాన్స్ కి నచ్చదు కాబట్టి స్ఫూర్తి అనడం కరెక్ట్. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘అజ్ఞాతవాసి’ సినిమాను ఏకంగా హాలీవుడ్ నుండి కాపీ కొట్టి పవన్ కళ్యాణ్ తో తీసాడు త్రివిక్రమ్. కానీ దాని రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు లేటెస్ట్ గా బ్లాక్ బాస్టర్ అయిన ‘అరవింద సమేత’ విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఈసారి సినిమా మొత్తం కాదు. ఒక్క సీన్ హాలీవుడ్ నుండి కాపీ కొట్టారట. అరవిందలో కీలకంగా మారే ఫస్ట్ హాఫ్ లో మొండికత్తి పేపర్ ఎపిసోడ్ ను 2013లో హాలీవుడ్ లో వచ్చిన ‘ది ఫ్యామిలీ’ అనే సినిమా నుండి కాపీ కొట్టారట. అందులో మాఫియా డాన్ అయిన రాబర్ట్ డీనీరో ఫ్రాన్స్ నుంచి అమెరికా వెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉంటాడు. అదే సమయంలో స్కూల్ లో ఇవ్వాల్సిన వ్యాసం కోసం రాబర్ట్ కొడుకు కోరిక మేరకు తన స్వంత కథనే చెబుతాడు. ఆ కాగితం ముక్క ఎక్కడెక్కడో ప్రయాణించి ఆఖరికి విలన్ చేతికి చిక్కుతుంది. అప్పుడు రాబర్ట్ జాడ తెలుస్తుంది. అచ్చంగా దీన్నే త్రివిక్రమ్ తన సినిమాలో పెట్టి దానికి మొండికత్తి అనే టైటిల్ పెట్టాడు.
సినిమాకి హైలైట్ అయ్యే సీన్ ఆ సీన్ త్రివిక్రమ్ కాపీ కొట్టడంతో..ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈసినిమాకు ఈ చిన్న విమర్శ పెద్ద లెక్క ఏమీ కాదు. సో దీన్ని ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు కొంతమంది త్రివిక్రమ్ ఫ్యాన్స్.