ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత - వీర రాఘవ టాక్ తో సంబంధం లేకుండా నిన్న వారాంతం వరకు కలెక్షన్స్ వర్షం కురిపించింది. అరవింద సమేత కి మిక్స్డ్ టాకొచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మేసింది. అయితే సినిమాకి మిక్స్డ్ టాకొచ్చినా సెలవల్లో సరైన సినిమా లేకపోవడం, ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండడంతో సినిమాకి కలెక్షన్స్ బాగా వచ్చాయి. అందులోను మాస్ లో ఎన్టీఆర్ కున్న ఫాలోయింగ్ వలన సినిమాకి టాక్ అంతంత మాత్రం ఉన్నప్పటికీ మొదటి నాలుగు రోజులంటే... గురువారం, శుక్రవారం, శని, ఆదివారాల్లో అరవింద కలెక్షన్స్ అదిరిపోయాయి.
అయితే ఏ సినిమాకైనా మొదటి వారాంతం సినిమా కలెక్షన్స్ బాగానే ఉంటాయి. అదే బ్లాక్ బస్టర్ గాని, సూపర్ హిట్ టాకొస్తే ఫస్ట్ వీక్ మొత్తం సినిమా కి ఫుల్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. కానీ సినిమాకి టాక్ కొద్దిగా యావరేజ్ పడినా మొదటి వారం కలెక్షన్స్ లో వీక్ మిడిల్ కలెక్షన్స్ డ్రాప్ అవడమే అనేది చాలా సహజం. ఇక అరవింద సమేతకి మొదటి నాలుగురోజుల కలెక్షన్స్ బావున్నప్పటికీ..... సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నట్టుగా కనబడ్డాయి.
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఓవర్సీస్ లోను అరవింద కలెక్షన్స్ సోమవారం కాస్త డ్రాప్ అయ్యాయంటున్నారు. ఇక ఆదివారం సాయంత్రం స్టార్ మా లో ప్రసారమైన రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం సినిమా వలన అరవింద సమేత ఫస్ట్ షోకి కాస్త కలెక్షన్స్ పడిపోయి థియేటర్స్ సగం మాత్రమే నిండాయంటున్నారు. అయితే సోమవారం అరవింద లెక్కలు తారుమారయినా.. ఇది సెలవలు సీజన్ కాబట్టి మళ్ళీ మంగళవారం సినిమాకి కలెక్షన్స్ నిలదొక్కుకునే అవకాశం ఉందంటున్నారు. ఇకపోతే గురువారం మరో రెండు సినిమాలు థియేటర్స్ లో దిగుతున్నాయి. రామ్.. ‘హలో గురు ప్రేమకోసమే’, విశాల్ ‘పందెం కోడి 2’ సినిమాల్లో ఏది హిట్ అయినా అరవింద సమేతకి గండం ముంచుకొచ్చినట్లే. చూద్దాం.. అరవింద సమేత అదృష్టం ఈ వారం ఎలా వుండబోతుందో అనేది.