Advertisementt

ఫ‌స్ట్ లుక్: ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి

Fri 19th Oct 2018 05:56 PM
that is mahalakshmi,tamanna,first look,tamanna in that is mahalakshmi  ఫ‌స్ట్ లుక్: ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి
First Look: Tamanna in That Is Mahalakshmi ఫ‌స్ట్ లుక్: ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి
Advertisement
Ads by CJ

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో త‌మ‌న్నా ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది. ప్ర‌తిష్టాత్మ‌క ఐఫిల్ ట‌వ‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంది. అమాయ‌కంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఎలా శ‌క్తివంత‌మైన మ‌హిళగా మారుతుంది అనేది ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి క‌థ‌. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. మైఖెల్ ట‌బూరియ‌స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తైజాన్ ఖొరాకివాలా ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌గా.. మీడియెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ లో మ‌ను కుమ‌రన్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం. త్వ‌ర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్. 

త‌మ‌న్నా ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌: తైజాన్ ఖొరాకువాలా, నిర్మాత‌: మ‌ను కుమ‌ర‌న్, నిర్మాణ సంస్థ‌: మీడియెంట్, స‌హ నిర్మాత‌లు: ప‌రుల్ యాద‌వ్, పంక‌జ్ క‌పూర్, కే వెంక‌ట్రామ‌న్, మ‌నోజ్ కేశ‌వ‌న్ లిగ‌ర్, త్యాగ‌రాజ‌న్, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్స్: జి మోహ‌న‌చంద్ర‌న్, హెట‌ల్ యాద‌వ్, యోగేష్ ఈశ్వ‌ర్ ధాబువాలా, సంగీతం: అమిత్ త్రివేది, సినిమాటోగ్ర‌ఫీ: మైఖెల్ ట‌బూరియ‌స్, ఎడిట‌ర్: గౌత‌మ్ నెరుసు, కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

First Look: Tamanna in That Is Mahalakshmi:

That Is Mahalakshmi Movie first Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ