కాదంబరి కిరణ్ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రాఘ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ చిత్రం ప్రారంభం
డి.ఎస్. రెడ్డి నిర్మాణ సారథ్యంలో గజపతి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రాఘ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర ప్రారంభం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ‘మనం సైతం’ కాదంబరి కిరణ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గజపతి శ్రీనివాస్, సర్లాన రాంబాబు, సన్ మీడియా సీఈఓ గంటా స్వామి, చిత్ర హీరోయిన్ షహరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు గజపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్రాన్ని ప్రారంభించి, మమ్మల్ని ఆశీర్వదించిన కాదంబరి కిరణ్ కుమార్‌గారికి కృతజ్ఞతలు. నూతన నటీనటులతో పాటు సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు. ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. పూర్తి వివరాలను అతి త్వరలో తెలియజేయనున్నాము..’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: తలారి శ్రీనివాస్, డిఓపి: యలమంచిన ఈశ్వర్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్: జీవీవీ సత్య, శాంతారెడ్డి, మణికంఠ వారణాసి, వివిఎస్ శ్రీకర్; ప్రొడక్షన్ మేనేజర్: ఇప్పిలి అప్పారావు, డైలాగ్స్: అనిల్.కె, నిర్మాణం: డి.ఎస్.రెడ్డి, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: గజపతి శ్రీనివాస్.