ఇటీవల ‘క్వీన్’ దర్శకుడిపై హీరోయిన్ కంగనారౌనత్ లైంగిక వేధింపుల తరహాలో ఘాటు వ్యాఖ్యలే చేసింది. ఇక ఈమె నటించిన ఏదైనా చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది అనిపిస్తే చాలు ఈమెకి హీమ్యాన్, తన మాజీ ప్రియుడు హృతిక్‌రోషన్ గుర్తుకొస్తాడు. ఇటీవల కూడా కంగనారౌనత్, ఆమె సోదరి కలసి హృతిక్ మీద నానా ఆరోపణలు చేసి కావాల్సింత పబ్లిసిటీ సాధించారు. ఇక ‘క్వీన్’ చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తాజాగా కంగనా రౌనత్ ప్రకటించింది. అందునా అది ఆమె రాణి ఝూన్సీలక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌గా రూపొందుతున్న ‘మణికర్ణిక’ విడుదల సమయంలో ఈ మాటల మాట్లాడింది.
దీంతో ఒళ్లుమండిన ఆ దర్శకుడి మొదటి, అంటే మాజీ భార్య కంగనా తీరుని తప్పుపడుతూ తన మాజీ భర్తకి మద్దతు తెలిపింది. దాంతో కంగనా కూడా ఆమెని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో నిన్న, నేటితరం స్టార్స్‌లో నాగార్జున, మహేష్‌బాబు, ప్రభాస్‌లను జెంటిల్‌మేన్స్‌గా పిలుస్తుంటారు. వీరి బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. ఇటీవల కాలంలో ఏ బాలీవుడ్ హీరోయిన్‌ని అయినా మీకు ఎవరితో నటించాలని ఉందంటే మహేష్, ప్రభాస్‌ల పేర్లే చెబుతూ ఉంటారు. ఇక ప్రభాస్ చాలా జెంటిల్‌మేన్. ఆయన చాలా సిగ్గరి కూడా. కానీ మనిషి నచ్చితే ఎంతో స్నేహంగా ఉంటాడు. మాట్లాడేది కూడా తక్కువే. అయితే ‘బాహుబలి’ తర్వాత తాను అభిమానులతో, అందరితో కలివిడిగా ఉండటం నేర్చుకుంటున్నానని చెప్పాడు. ఇక ఈయన అందరికీ డార్లింగ్. అలాగే ప్రభాస్ కూడా అందరినీ డార్లింగ్ అనే ముద్దుగా పిలుస్తూ ఉంటాడు.
కాగా చాలా ఏళ్ల కిందట పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్-కంగనారౌనత్ కలసి నటించిన చిత్రం ‘ఏక్ నిరంజన్’. ఈ చిత్రానికి హీరోయినే మెయిన్ మైనస్ పాయింట్ అయింది. చిత్రం కూడా సరిగా ఆడలేదు. ఇక ‘మణికర్ణిక’ సందర్భంగా కంగనా మరోసారి ప్రభాస్ విషయం లేవనెత్తింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఏక్‌నిరంజన్’ సమయంలో మా ఇద్దరి మద్య పెద్ద గొడవ జరిగింది. ఆపై మేమిద్దరం మాట్లాడుకోవడం మానివేశాం. ‘బాహుబలి’లో ప్రభాస్ నటన చూసి గర్వపడ్డాను. ‘మణికర్ణిక’లో నా నటన చూసి ప్రభాస్ కూడా అంతే గర్వంగా ఫీలవుతాడని ఆశిస్తున్నాను అని తెలిపింది. అయితే ఈ ఇద్దరికి ఏ విషయంలో, ఎందుకు గొడవ జరిగిందో మాత్రం ఆమె చెప్పలేదు. ఏళ్లకు ఏళ్లుగా ఈ విషయాన్ని ఆమె దాస్తూనే ఉందని, ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్‌గా పలువురు అభివర్ణిస్తున్నారు.