పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మంచు కురిసే వేళలో’
రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘మంచు కురిసే వేళలో’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంది. దేవా కట్టా వద్ద ప్రస్థానం చిత్రానికి దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ.. ‘‘మంచు కురిసే వేళలో.. టైటిల్ తగ్గట్టుగానే ప్యూర్ లవ్ ఎంటర్‌టైనర్. వైజాగ్, కూర్గ్, ఊటి, అరకు, హైదరాబాద్‌లలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాము. నిర్మాణాంతర కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. కథ, కథనాలతో పాటు టెక్నికల్‌గా కూడా ది బెస్ట్ వర్క్ ఈ సినిమాలో చూస్తారు. ‘మళ్లీ రావా’ ఫేమ్ శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ మా సినిమాకు ఎస్సెట‌్‌గా నిలుస్తాయి. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తాము. డిసెంబర్‌లో సినిమాను రిలీజ్ చేస్తాము..’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాణం: ప్రణతి ప్రొడక్షన్, కథ-స్క్రీన్‌ప్లే-నిర్మాత-దర్శకత్వం: బాల బోడెపూడి