Advertisementt

నిజంగా అనుకి ‘అందుకే’ అవకాశాలొస్తున్నాయా?

Mon 29th Oct 2018 09:20 PM
anu emmanuel,latest interview,skin show,liplock,movies chances,heroine anu emmanuel  నిజంగా అనుకి ‘అందుకే’ అవకాశాలొస్తున్నాయా?
Anu Emmanuel About Movie Chances నిజంగా అనుకి ‘అందుకే’ అవకాశాలొస్తున్నాయా?
Advertisement
Ads by CJ

సక్సెస్ ఉంటేనే లెక్కలోకి తీసుకునే రోజులివి. అలాంటిది అను ఇమ్మాన్యుయేల్‌కు వరస ఫెయిల్యూర్స్ ఉన్నా ఆమెకు స్టార్ హీరోస్ పక్కన నటించే ఛాన్స్ రావడం మాములు అదృష్టం కాదు. ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీకి తెలుగులో వరస ప్లాప్స్ వచ్చిన అవకాశాలు రావడం మాత్రం మానలేదు. రీసెంట్ గా ఆమె ఓ డైలీ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల్ని చెప్పింది. 

మీ సినిమాలు ప్లాప్ అవుతున్నా.. మీకు అవకాశాలు ఎలా వస్తున్నాయి అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇది.. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లేకపోతే ఛాన్స్‌లు రావడం కష్టమే అని తెలుసు, కానీ సినిమా ఫెయిల్ అయినంత మాత్రానా వారి నటన ఫెయిల్ అవ్వదుగా ? నేను చేసిన సినిమాల్లో నా నటన నచ్చడంతో నాకు అవకాశాలు వస్తున్నాయి అని చెప్పింది. నా పాత్ర బాగుండి.. సినిమా ఆడకపోతే నాకు బాధగా ఉంటుందని.. క‌ష్టాల నుంచే స‌క్సెస్ మొద‌ల‌వుతుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పింది.

మీరు చేసిన ప్రతి సినిమాలో ఒక్క ‘అజ్ఞాతవాసి’  మిన‌హాయిస్తే అన్ని సినిమాల్లో లిప్ లాక్ ఉంటుంది అని ప్రశ్నిస్తే.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు గ్లామ‌ర్ హంగు ఉండాల‌న్న‌ది సూత్రం. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ కి.. స్కిన్ షో తప్పనిసరి అని స‌మ‌ర్థించుకుంది. తన సినిమాల్లో స్కిన్ షోస్..లిప్ లాక్స్ కావాల‌ని ఇరికించిన‌ట్లుగా క‌నిపించ‌వ‌ని సెల‌విచ్చింది.

Anu Emmanuel About Movie Chances:

Anu Emmanuel Latest Interview Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ