Advertisementt

రాజ‌శేఖ‌ర్ ‘క‌ల్కి’ చిత్రంలో ముగ్గురు భామలు

Wed 31st Oct 2018 10:14 PM
dr. rajasekhar,kalki movie,three heroines  రాజ‌శేఖ‌ర్ ‘క‌ల్కి’ చిత్రంలో ముగ్గురు భామలు
Dr. Rajasekhar’s ‘Kalki’ to have three heroines రాజ‌శేఖ‌ర్ ‘క‌ల్కి’ చిత్రంలో ముగ్గురు భామలు
Advertisement
Ads by CJ

డా.రాజ‌శేఖ‌ర్ ‘క‌ల్కి’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు

డా.రాజ‌శేఖ‌ర్ న‌టించిన `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. `అ` వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందనున్న `క‌ల్కి` చిత్రానికి సంబంధించిన టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆల్ రెడీ విడుద‌ల చేశారు.    

శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రానికి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.  ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా సంద‌డి చేయ‌నున్నారు. అశుతోష్ రానా మరియు  నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థాంశం సాగుతుంది. హైద‌రాబాద్ నగర శివార్లలో రెండు కోట్ల రూపాయ‌ల‌తో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

Dr. Rajasekhar’s ‘Kalki’ to have three heroines :

Three Heroines in Kalki Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ