Advertisementt

సెల్‌ఫోన్‌పై శంకర్ సాహసం చేస్తున్నాడా?

Mon 05th Nov 2018 05:21 PM
shankar,fight,cell phone,users,2.0 movie,scenes,revealed  సెల్‌ఫోన్‌పై శంకర్ సాహసం చేస్తున్నాడా?
Shankar Fight on cell Phone Users సెల్‌ఫోన్‌పై శంకర్ సాహసం చేస్తున్నాడా?
Advertisement
Ads by CJ

సెల్ వాడుతున్నారంటే మీరు హంతకులు. ఇది మేము అంటున్న మాటా కాదండి.. నిన్న రిలీజ్ అయిన రజిని 2.0 సినిమా ట్రైలర్ లో విలన్ అక్షయ్ కుమార్ అంటాడు. ట్రైలర్ మొత్తం చూస్తే అక్షయ్ కుమార్ ఆకారం సెల్ ఫోన్స్ అన్ని కలిపి అతని రూపంలాగా చేస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. సెల్ ఫోన్ వాడుతున్న వాళ్ళు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా భయపడతారు అని శంకర్ ఈ సినిమా ద్వారా చెప్పనున్నాడు. ఇటువంటి పాయింట్ తో శంకర్ సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. అందరికి ఇష్టమైన సెల్ ఫోన్ ని వాడొద్దు అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి.

2.0 విషయంలో శంకర్ అదే పని చేస్తున్నాడు. అయితే శంకర్ ని తక్కువ అంచనా వేయలేం. సినిమాని తనదైన శైలిలో తెరకెక్కించాడు అని తెలుస్తుంది. ట్రైలర్ చివరిలో రోబో రజనీతో తలపడే అక్షయ్ కుమార్ సీన్ ని జాగ్రత్తగా గమనిస్తే.. అందులో మరో రజినీ ఫేస్ ఉంటుంది. రోబోని ఎదురుకోవడానికి అక్షయ్ రజిని రూపంలోకి మారి రోబోతో మైండ్ గేమ్ ఆడతాడంట. సినిమాకి ఈ సీన్ హైలైట్ అని తెలుస్తుంది.

ట్రైలర్ లో చూపిస్తున్నట్టుగా స్టేడియం ఎపిసోడ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తుందని టాక్. కొన్నికొన్ని సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటాయట. ఇప్పటికి పలు మార్లు వాయిదా పడ్డ 2.0 కు ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈనెల 29న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Shankar Fight on cell Phone Users:

2.O Highlight Scenes Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ