Advertisementt

మా అమ్మాయే హీరోయిన్: దర్శకుడు

Mon 05th Nov 2018 10:56 PM
kotha kurrodu,censor completed,kotha kurrodu movie update,sriram,sripriya  మా అమ్మాయే హీరోయిన్: దర్శకుడు
Kotha Kurrodu Movie Censor Completed మా అమ్మాయే హీరోయిన్: దర్శకుడు
Advertisement
Ads by CJ

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కొత్త కుర్రోడు’.

శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) నిర్మిస్తోన్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. 

ఈ సందర్భంగా నిర్మాత ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) మాట్లాడుతూ.. ‘‘డైరెక్ట‌ర్ రాజా నాయుడుగారు సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌క్క‌గా తీశారు. హీరో హీరోయిన్స్ బాగా న‌టించారు. సినిమా బాగా వ‌చ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సాయి ఎలెందర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర పాటలు విడుదలై అందరిని ఆకట్టుకుంటున్నాయి.

త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు రాజా నాయుడు.ఎన్ మాట్లాడుతూ..‘‘ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ స‌హ‌కారం వల్ల‌నే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాను. ఎన్నో అడ్డంకులు వ‌చ్చినా నిర్మాత లక్ష్మ‌ణ్‌గారు మాకు అండ‌గా నిల‌బ‌డి సినిమాను పూర్తి చేయించారు. సినిమాటోగ్రాఫ‌ర్ స‌తీశ్‌గారు చ‌క్క‌టి విజువ‌ల్స్‌తో సినిమాను పిక్చ‌రైజ్ చేశారు. మా అమ్మాయి శ్రీప్రియ‌ను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేస్తున్నాను. హీరో శ్రీరామ్ చ‌క్క‌గా యాక్ట్ చేశాడు. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ - రాజా నాయుడుగారు నాకు హీరోగా అవ‌కాశం ఇచ్చారు. అన్ని ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇదన్నారు. 

హీరోయిన్ శ్రీప్రియ మాట్లాడుతూ - డైరెక్ట‌ర్ మా నాన్న‌గారు అయినా కూడా న‌న్ను ఆడిష‌న్‌లోనే ఎంపిక చేసుకున్నారు. మంచి రోల్ చేశానన్నారు. 

శ్రీరామ్‌, శ్రీప్రియ‌, ప‌దిలం క‌ల్యాణ్ బాబు, జెవి.రావు, యోగి, అంజ‌లి, శ్రావ‌ణి, మాధ‌వీ ల‌త‌, ఆశ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి నిర్వ‌హ‌ణ: అబ్బూరి నాగేంద్ర చౌద‌రి, కెమెరా: స‌తీశ్ ముదిరాజ్‌, ఎడిట‌ర్‌: రాఘ‌వేంద్రరెడ్డి, సంగీతం: సాయి ఎలేంద‌ర్‌, నిర్మాత‌: ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌), క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రాజా నాయుడు.ఎన్‌.

Kotha Kurrodu Movie Censor Completed:

Kotha Kurrodu Movie Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ