Advertisementt

ఆడపడుచుని కాకాపడుతోన్న హాట్ భామ!

Fri 09th Nov 2018 01:05 PM
priyanka chopra,sails,bachelorette party,girl squad  ఆడపడుచుని కాకాపడుతోన్న హాట్ భామ!
Priyanka Chopra gives ‘sister-in-law’ Sophie Turner a piggyback ఆడపడుచుని కాకాపడుతోన్న హాట్ భామ!
Advertisement
Ads by CJ

ఆడపడుచు అర్ధ మొగుడు అంటారు. ఆడపడుచుల పోరు తగ్గాలంటే భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచులను కూడా బాగా కాకాపట్టాలి. ఈ విషయం పాశ్చాత్య దేశాల వారిని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వర్తిస్తుందని తాజాగా బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా ఎదిగిన ప్రియాంకా చోప్రా నిరూపిస్తోంది. 

ఇక విషయానికి వస్తే త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న ప్రియాంకా చోప్రా బ్యాచ్‌లర్స్‌ పార్టీలలో బిజీగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రియాంకా, నిక్‌జోనాస్‌లు ఒకటి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి వివాహం ఇండియాలోని ఉదయ్‌పూర్‌లో జరగనుందని బీటౌన్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమ్‌స్టర్‌ డ్యామ్‌లో బ్యాచ్‌లర్స్‌ పార్టీలలో బిజీగా ఉన్న ప్రియాంకా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకుని అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఫొటోలను చూస్తే బాలీవుడ్‌ మీడియా చెబుతున్న దానికి బలం చేకూరుతోంది. ఈ సందర్భంగా ప్రియాంకా పోస్ట్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 

ప్రియాంకా తాను పెళ్లి చేసుకునే నిక్‌ జోనాస్‌ సోదరి, తనకి కాబోయే ఆడపడుచు సోఫియా టర్నర్‌ని భుజం మీదకి ఎక్కించుకుని ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో ప్రియాంకా నా మరదలు, కాబోయే ఆడపడుచు కోసం ఇవ్వన్నీ చేయాల్సి వస్తోందని, 'జేసోదరి' అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోపై దేశవ్యాప్తంగా బాగా చర్చ సాగుతూ, మీడియాను బాగా ఆకర్షిస్తోంది. మొత్తానికి ఈ కాబోయే జంటకు విషెష్‌ చెప్పాల్సిందేనని, వారి వివాహం డిసెంబర్‌లో ఖాయమని బిటౌన్‌ వర్గాలు అంటున్నాయి.

Priyanka Chopra gives ‘sister-in-law’ Sophie Turner a piggyback:

Priyanka Chopra sails off on bachelorette party with girl squad 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ