దీపావళి సందర్భంగా రీసెంట్ గా రిలీజ్ అయిన 'సర్కార్' చిత్రంకు డివైడ్ టాక్ తో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ రాష్ట్రాలలో కూడా జోరు కొనసాగిస్తుంది. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లో 110 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి రికార్డు ను క్రియేట్ చేసింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో విజయ్.. పవన్ కళ్యాణ్ ను కాపీ కొట్టిన విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా సాగుతోంది.
ఇందులో విజయ్ మక్కికి మక్కిగా కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ ని దింపేశాడని.. అంతే కాదు పవన్ స్టైల్ లో 'ప్రశ్నిస్తాను.. ప్రశ్నించడానికి వచ్చాను.. అధికారంలో ఉండేవారిని ప్రశ్నించకుండా వదిలే సమస్యే లేదు' అంటూ విజయ్ చెప్పడంతో విజయ్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ తో చెలరేగిపోతున్నారు.
విజయ్ త్వరలోనే పార్టీ పెడతాడని అందుకే ఈ 'ప్రశ్నించడం' అని సెటైర్లు పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' లో 'అహ్.. అహ్.. అహ్' అంటూ అమ్మాయిలను ఇమిటేట్ చేస్తూ హంగామా చేస్తాడు కదా.. అచ్చం అలానే విజయ్ కూడా ఈ సినిమాలో ఓ సీన్ లో చేస్తాడు. పవన్ అలా చేయడం కొంచెం ఓవర్ అయిందని ఆ మధ్య కొంతమంది ఓపెన్ గా అన్నారు. మళ్లీ ఇప్పుడు అలా విజయ్ చెయ్యడం అందరినీ విస్తుపోయేలా చేసింది. దాంతో విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఈ ఇమిటేషన్ ట్రోలింగ్ మొదలుపెట్టారు.