Advertisementt

అర్జున్ పండిట్.. ఎన్‌.ఎస్‌.జి క‌మెండో లుక్..!!

Fri 09th Nov 2018 05:26 PM
operation gold fish,first look,response,team,happy,aadi saikumar,saikiran adivi  అర్జున్ పండిట్.. ఎన్‌.ఎస్‌.జి క‌మెండో లుక్..!!
Tremendous Response to Operation Gold Fish First Look అర్జున్ పండిట్.. ఎన్‌.ఎస్‌.జి క‌మెండో లుక్..!!
Advertisement
Ads by CJ

‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్’ ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

శ‌షా చెట్రి(ఎయిర్ టెల్ మోడ‌ల్‌), ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్,  మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న  యాక్ష‌న్ , రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌’. వినాయ‌కుడు టాకీస్ బ్యాన‌ర్‌పై య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ల్పిత కథాంశంతో.. ‘వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత’ వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.  ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు.  ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో  భాగ‌మ‌వ‌డం ఇదే తొలిసారి. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు. ఇందులో ఆది సాయికుమార్ క్యారెక్ట‌ర్‌ను అర్జున్ పండిట్ అనే ఎన్‌.ఎస్‌.జి క‌మెండోగా ఈ లుక్‌లో చూపించారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ అడివి మాట్లాడుతూ..‘‘ఫ‌స్ట్‌లుక్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం సినిమా ఫైన‌ల్ షెడ్యూల్‌ను కార్గిల్‌(జ‌మ్ము &కాశ్మీర్‌), హిమాచ‌ల్ ఫ్ర‌దేశ్‌ల‌లో చిత్రీక‌రించాం. -10 డిగ్రీల చ‌లిలో 9000-13500 అడుగుల ఎత్తులో సినిమా షూటింగ్ చేస్తున్నాం. మా యూనిట్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తాం. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రాసుకున్న ఫిక్ష‌న‌ల్ స్టోరీ ఇది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసిన త‌ర్వాత సినిమాను విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం..’’ అన్నారు. 

Tremendous Response to Operation Gold Fish First Look :

Operation Gold Fish Team Happy with First Look response

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ