Advertisementt

‘47డేస్’ రెడీగా ఉండండి..!!

Sat 10th Nov 2018 02:22 PM
trisool cinema,47 days,overseas rights  ‘47డేస్’ రెడీగా ఉండండి..!!
47 Days Ready to Release ‘47డేస్’ రెడీగా ఉండండి..!!
Advertisement
Ads by CJ

డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ‘47డేస్’

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ వైజాగ్, అరకు, గోవా, హైదారాబాద్‌లలో పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కంప్లీట్ టెక్నిషియన్స్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి టాక్ నడుస్తోంది. ఈ మూవీ అవుట్‌పుట్ తెలిసిన త్రిశూల్ సినిమా ఫ్యాన్సీ రేట్‌కు ఓవర్సీస్ హక్కులు దక్కించుకుంది.

తెలుగు ప్రేక్షకులకు ‘47డేస్’ చిత్రం సరికొత్త అనుభూతి ఇస్తుందని నమ్మకంగా చెబుతుంది చిత్ర యూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్య కథాంశంగా వస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయని అంటుంది చిత్ర యూనిట్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచే, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

47 Days Ready to Release:

Trisool Cinema Bought 47 Days Overseas rights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ