‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ తన టాలెంట్ చూపిస్తున్న షకలక శంకర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘కేడీ నెం 1’. జానీ దర్శకత్వంలో డి.గిరీష్ బాబు నిర్మిస్తున్నారు. ఖుషీ గడ్వీ, గుర్లిన్ చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత డి.గిరీష్ బాబు మాట్లాడుతూ.. ‘‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా జానీ దర్శకత్వంలో ‘కేడీ నెం 1’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాను. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దర్శకుడు జానీ అద్భుతంగా తెరకెక్కించారు. పూర్తి స్థాయి యాక్షన్ ఫిలిం. టీమ్ అందరి సహకారంతో సినిమాను అనుకున్న విధంగా రూపొందించగలిగాం’’ అన్నారు.
ముఖుల్ దేవ్, జహీర్ ఖాన్, తాగు బోతు రమేష్, గబ్బర్ సింగ్ టీమ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ పట్నాయక్; కెమెరా: ముజీర్; కొరియోగ్రాఫర్: శివ శంకర్ మాస్టర్; ఫైట్స్: కృష్ణం రాజు; ప్రొడ్యూసర్: డి.గిరీష్ బాబు; స్టోరీ- స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: జానీ.