సందడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత, చెన్నై లో ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత, ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆదిత్యరామ్ తల్లి శ్రీమతి పి.లక్ష్మి ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. ఆవిడ అంత్యక్రియలు చెన్నై లోని ఆదిత్యరామ్ నగర్ లో ఈ రోజు (నవంబర్ 11) సాయంత్రం జరుపుతారు.