Advertisementt

మహేష్ ‘మహర్షి’.. హాట్ కేక్..!!

Mon 12th Nov 2018 01:04 PM
mahesh babu,maharshi,hindi,dubbing,rights,sold out  మహేష్ ‘మహర్షి’.. హాట్ కేక్..!!
Mahesh Babu Maharshi Hot Cake మహేష్ ‘మహర్షి’.. హాట్ కేక్..!!
Advertisement
Ads by CJ

దిల్ రాజు - పీవీపీ - అశ్వినీదత్ లు కలిసి మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్‌గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహర్షి మూవీపై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం.. ఈ చిత్రంలో మహేష్ చాలా హ్యాండ్సమ్ గా, స్టైలిష్ గా కనిపించడం... ఫస్ట్ లుక్ తోనే మహేష్ అందరినీ ఆకర్షించడంతో సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగాయి. మహేష్ ఈ సినిమాలో సాఫ్ట్‌వేర్ అబ్బాయిగానూ, రైతుగానూ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

అయితే భారీ అంచనాలున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను ఆ మధ్యన దిల్ రాజు భారీగా కోడ్ చేసాడనే టాక్ నడిచింది. మహేష్ మహర్షి హిందీ డబ్బింగ్ హక్కుల విషయంలో దిల్ రాజు చాలా గట్టిగా ఉన్నాడని... మిగతా నిర్మాతలతో చర్చించకుండానే మహర్షి హక్కులను హిందీలో భారీ రేటుకు అమ్మాలనుకున్నాడని అన్నారు. అయితే ఈమధ్యలో మహర్షి హిందీ డీల్ విషయలో పెద్దగా చర్చకు రాలేదు కానీ.. తాజాగా మహర్షి హిందీ డీల్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తుంది. మమూలుగా తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు హిందీలో డబ్ అవడమే తరువాయి ..యూట్యూబ్ లో వదిలితే చాలు.... కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి.

అందుకే తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మహేష్ మహర్షి హిందీ డబ్బింగ్ హక్కులకు దిల్ రాజు 25 కోట్లు కోడ్ చేస్తే.. చివరికి 20 కోట్లకు బాలీవుడ్ లో ఒక నిర్మాణ సంస్థ డీల్ కుదిర్చునట్లుగా చెబుతున్నారు. ఇక దిల్ రాజు కూడా ఆ డీల్ ను ఓకే చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇంతకుముందు 22 కోట్లతో రంగస్థలం టాప్ ప్లేస్ లో ఉంటే... ఇప్పుడు మహర్షి 20 కోట్లతో  రెండవస్థానంలో నిలిచింది. మరి ఈ హిందీ రేట్లను చూస్తుంటే.. తెలుగు సినిమాలకు హిందీలో ఎంత గిరాకీ ఉందో అర్ధమవుతుంది.

Mahesh Babu Maharshi Hot Cake:

Maharshi Hindi dubbing Rights Sold Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ