Advertisementt

డేటింగ్ చేస్తున్నానని డైరెక్ట్‌గా చెప్పేసింది

Wed 14th Nov 2018 06:19 PM
sushmita sen,dating,boyfriend,rohman shawl  డేటింగ్ చేస్తున్నానని డైరెక్ట్‌గా చెప్పేసింది
Top Heroine Confirms Dating with Boyfriend డేటింగ్ చేస్తున్నానని డైరెక్ట్‌గా చెప్పేసింది
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జునతో ‘రక్షకుడు’ సినిమాలో నటించిన సుస్మితా సేన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకు గుర్తు ఉండదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ.. నిత్యం వార్తల్లోనే ఉంటుంది కదా!. అయితే 40 ఏళ్లు నిండినా ఈ భామ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అదేమంటే ఏవేవో కారణాలు చెబుతుంది. అయితే పెళ్లి చేసుకోకపోయినా.. ఇద్దరు పిల్లలకు తల్లిగా సేవలు చేస్తోంది. అవును.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని.. పెంచుకుంటుంది.

అయితే ఈ భామ గురించి ఈ మధ్య మరో కోణంలో వార్తలు వినిపిస్తున్నాయి. సుస్మితకు పెళ్లిపై గాలి మళ్లీందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని వార్తలు రావడం, అలాగే మోడల్ రోమన్ షాల్‌లో ఈ మధ్య ఎక్కువగా కనిపించడం వంటి విషయాలతో ఆమె గట్టిగానే దొరికేసింది. రోమన్ షాల్‌‌తో ఇటీవల తాజ్‌మహల్ దగ్గర దర్శనమివ్వడంతో.. డౌటే లేదు ఈ భామ కూడా పెళ్లికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్‌లో వార్తలు వచ్చేశాయి.

అయితే ఈ వార్తలు తన వరకు రావడంతో.. ఆమే స్వయంగా ఈ విషయంపై స్పందించింది. పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేదు కానీ, రోమన్ షాల్‌తో డేటింగ్ చేస్తున్నది నిజమేనంటూ డైరెక్ట్‌గా చెప్పేసింది. ఆమె ఇలా క్లారిటీ ఇచ్చేసి.. తనపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది సుస్మితా సేన్.

Top Heroine Confirms Dating with Boyfriend:

Sushmita Sen Finally Confirms Dating Boyfriend Rohman Shawl

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ