Advertisementt

బాబూ.. శ్రీను వైట్ల విడుదల వరకు ఆగు!!

Thu 15th Nov 2018 12:02 PM
srinu vaitla,interivew,mythri movie makers,amar akbar antony  బాబూ.. శ్రీను వైట్ల విడుదల వరకు ఆగు!!
Srinu Vaitla About Amar Akbar Antony బాబూ.. శ్రీను వైట్ల విడుదల వరకు ఆగు!!
Advertisement
Ads by CJ

ఏ డైరెక్టర్‌కి అయినా రెండు మూడు అట్టర్ ప్లాప్స్ తగిలాయి అంటే ఆ డైరెక్టర్ పనైపోయినట్లే. ఇక ఆ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు ఏ హీరో గానీ, నిర్మాతలు గానీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపరు. ఒకవేళ బై లక్ ఆ డైరెక్టర్ కి ఎవరైనా సినిమా ఇచ్చారంటే ఆ సినిమా విడుదల తర్వాత సినిమా హిట్ కాకపోతే ఇక ఆ డైరెక్టర్ ఇంటికెళ్లాల్సిందే అంటూ సెటైర్స్ కూడా వేస్తారు. ప్రస్తుతం పైన చెప్పిన పొజిషన్ లోనే టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు, అట్టర్ ప్లాప్స్ ఇచ్చిన శ్రీను వైట్ల కి చాలా రోజులకి రవితేజ అమర్ అక్బర్ ఆంటొని సినిమా అవకాశం ఇచ్చాడు.

అదృష్టవశాత్తు ఆ సినిమాకి మైత్రి మూవీస్ లాంటి మంచి బ్యానర్ దొరికింది. అయితే ఆ బ్యానర్ తనని పిలిచి అవకాశం ఇవ్వలేదని... తానే ఆ బ్యానర్‌ని సెలెక్ట్ చేసుకున్నానని చెబుతున్నాడు శ్రీను వైట్ల. ఈ శుక్రవారం అమర్ అక్బర్ ఆంటొని సినిమా విడుదల సందర్భంగా తెగ ఇంటర్వూస్ ఇస్తున్న శ్రీను వైట్ల కాస్త కాన్ఫిడెంట్‌గానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తనతో సినిమా అదేనండీ అమర్ అక్బర్ ఆంటొని సినిమాని చేసేందుకు ఐదుగురు నిర్మాతలు పోటీ పడ్డారట. ఐదుగురు లోంచి మైత్రీ మూవీ మేకర్స్‌ని అమర్ అక్బర్ ఆంటొని కోసం నేను ఎంపిక చేసుకున్నా అంటూ గొప్పగా చెప్పుకొచ్చాడు.

ఇక తాను ప్రతి సినిమాని ఓవర్ బడ్జెట్ లో కాకుండా అనుకున్న బడ్జెట్ లోనే  చేశానని చెబుతున్నాడు. ప్రస్తుతం ఏమైనా కానీ.. శ్రీను వైట్ల మాత్రం అమర్ అక్బర్ ఆంటొని మీద మాత్రం బాగా నమ్మకం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ సినిమా హిట్ మీదే శ్రీను వైట్ల ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆ సినిమా హిట్ అయితేనే స్టార్ హీరోలతో శ్రీను వైట్లకి సినిమాల అవకాశాలు వస్తాయి. ఏ గొప్పలైన సినిమా హిట్ అయితేనే వర్కౌట్ అవుతాయి. కానీ సినిమా ప్లాప్ అయ్యిందా.. గొప్పలు తిప్పలవుతాయి.

Srinu Vaitla About Amar Akbar Antony:

Srinu Vaitla Latest Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ