ఆనందభైరవిగా అలరించనున్న అంజలి
అతి తక్కువ కాలంలోనే చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకున్న అంజలి ప్రధాన పాత్రధారిగా ఆనందభైరవి చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. యువ కథానాయకుడు అంజలికి జోడి గా నటించనున్నారు. ప్రతిభావంతుడైన యువ దర్శకుడు కర్రి బాలాజీ దర్శకత్వంలో హరేవన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రమేశ్‌రెడ్డి ఇటికెల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సరికొత్త పాయింట్‌తో, భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది.
ఈ సినిమా గురించి నిర్మాత రమేశ్‌రెడ్డి ఇటికెల మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాలూ ఇందులో ఉండటంతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. డిసెంబర్‌లో లాంఛనంగా షూటింగ్ ప్రారంభిస్తాం. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అని తెలిపారు.
చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.. సమాజంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. హైదరాబాద్, వైజాగ్, కేరళలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తాం. వినోదం, ఉల్లాసం ఉంటూ ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. ముఖ్యంగా అంజలి పాత్ర ప్రతి ఇంట్లో ఉండే అమ్మాయిని గుర్తు చేసేలా ఉంటుంది.. అని చెప్పారు.
అంజలి మాట్లాడుతూ.. దర్శకుడు బాలాజీగారు చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. తొలిసారిగా యాక్షన్ పాత్ర పోషిస్తున్నాను. సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాను.. అని చెప్పారు.
సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న లక్ష్మీరాయ్ మాట్లాడుతూ.. ఇందులో నేను ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుంది. నటించడానికి బాగా స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.. అన్నారు.
రవికిషన్, బాహుబలి ప్రభాకర్, ధన్‌రాజ్, సత్యం రాజేశ్, ఆశిష్ విద్యార్ధి, బ్రహ్మాజీ, శ్రీహర్ష తదితరులు నటించే ఈ చిత్రానికి స్ర్కిప్ట్ కో-ఆర్డినేటర్: మధు విప్పర్తి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: పి.జి.విందా, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పరిటాల రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేశ్‌బాబు దత్తి, నిర్మాత: రమేశ్‌రెడ్డి ఇటికెల, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: కర్రిబాలాజీ.